అప్పన్న చందనోత్సవంలో గందరగోళం- స్వరూపానంద ఆగ్రహం, మంత్రి సీరియస్..!!
సింహాద్రి అప్పన్న చందనోత్సవ వేళ రసాభాస చోటు చేసుకుంది. భక్తుల ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది. ప్రోటోకాల్ దర్శనాలు గందరగోళంగా మారాయి. గంటల తరబడి వేచి చూడలేక భక్తులు మండిపడుతున్నారు. టైం స్లాట్ దర్శనాల్లో అధికారులు విఫలమయ్యారు.
ఈవోకు వ్యతిరేకంగా భక్తులు నినాదాలు చేసారు. స్వామి స్వరూప నరేంద్ర సరస్వతి ఆగ్రహం వ్యక్తం చేసారు. దేవాలయం ప్రతిష్ఠ మంట గలిపారని మండిపడ్డారు. మంత్రులకు నిరసనలు తప్పలేదు. మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారుల తీరు పైన సీరియస్ అయ్యారు.

భారీగా వచ్చిన భక్తులు: సింహాద్రి అప్పన్నస్వామి నిజరూప దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. తెల్లవారు జామున జరిగే చందనోత్సవం వేళ దర్శనానికి వచ్చే భక్తులు రూ 1,500 చెల్లిస్తే వీఐపీ ప్రోటోకాల్ టికెట్ల పై అంతరాలయం వరకు అనుమతిస్తామని అధికారులు ప్రకటించారు. ఈ టికెట్ల కోసం సిఫార్సు లేఖలు భారీగా వచ్చాయి. విచ్చలవిడిగా జారీ చేసారు. సాధారణ భక్తులు ఇబ్బంది పడ్డారు.
ఆరు వేల ప్రోటోకాల్ టికెట్ల జారీ పైన నిర్ణయం తీసుకోగా, 11వేల వరకు జారీ చేసారు. పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులను నియంత్రించలేక పోయారు. భక్తులు అసహనానికి గురయ్యారు. ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేసారు. మంత్రులను నిలదీసారు. దీంతో, ఆలస్యంగా ఆలయ పాలకవర్గం దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అంతరాలయ దర్శనం రద్దు చేసారు.
స్వరూపానంద ఆగ్రహం: శారద పీఠం స్వరూపనదేంద్ర సరస్వతి సింహాచలం చందనోత్సవం నిజరూపం దర్శనం కోసం వచ్చారు. దేవాయలంలో పరిస్థితులపైన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ రోజు దర్శనం ఎందుకు చేసుకున్నానా అని అనిపిస్తుందని వ్యాఖ్యానించారు. దేవాలయం ప్రతిష్ట మంటగలిపారని ఆగ్రహించారు. సింహాచలం పేదల దేవుడు పెద్దల దేవుడు కాదన్నారు.
కాని ఇక్కడ పెద్దలు మాత్రమే ఉన్నారు సామన్య భక్తులు లేరని చెప్పుకొచ్చారు. సాధరణ భక్తుల కేకలు వింటుంటే ఎడుపు వస్తుందని, సింహచలం చరిత్ర లో ఎప్పుడు ఇలా జరగలేదన్నారు. అత్యంత దారుణమైన తీరు అధికారుల కనబరిచారని విమర్శించారు. అంతరాలయంలో ప్రతిష్ట దిగాజార్చరని మండిపడ్డారు. భక్తుల యొక్క అర్తనాదలు అధికారుల కు తగులుతాయన్నారు.
మంత్రి కొట్టుకు నిరసన సెగ: భక్తుల నిరసన మంత్రులకు తప్పలేదు. దర్శనం కల్పించటంలో ఆలస్యం, అధికారుల వైఫల్యం పైన భక్తులు మండిపడ్డారు. ఆలయానికి వచ్చిన మంత్రులు బొత్సా సత్యనారాయణ, కొట్టు సత్యనారాయణ ను చూసి భక్తులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసారు. విఐ పిలకు ప్రాధాన్యత పై మండిపడ్డారు.
భక్తులు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ను నిలదీసారు. మంత్రి క్యూ లైన్ల వద్దకు వెళ్లి నచ్చ చెప్పే ప్రయత్నం చేసారు. కానీ, భక్తులు శాంతించలేదు. బారకేడ్ లు తెంచుకొని బయటకు వచ్చే ప్రయత్నం చేసారు. అధికారుల తీరు పైన మంత్రి కొట్టు సీరియస్ అయ్యారు. పోలీసులు రంగ ప్రవేశం చేసారు. అధికారులు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు.












Click it and Unblock the Notifications