• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

అతిథి గృహాలు కాదు.. వ్యభిచార కొంపలు.. కొరడా ఝలిపిస్తున్న పోలీసులు..!

|

విశాఖపట్నం : ప్రకృతి అందాలకు తోడు అమ్మాయిల దందా విశాఖలో యధేచ్ఛగా సాగుతోంది. గుట్టు చప్పుడు కాకుండా ముగ్గురు అమ్మాయిలు ఆరుగురు విటులు అన్న చందంగా వ్యభిచారం జోరందుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను తీసుకొస్తూ పెద్ద ఎత్తున గలీజు దందా కొనసాగిస్తున్నారు నిర్వాహకులు. అతిథి గ‌ృహాల పేరిట ముందు ఓ కోణం కనిపిస్తే.. వెనుకాల ఈ పాడు పని స్వైర విహారం చేస్తోంది. విటులను ఆకట్టుకుంటూ వేల రూపాయలు గుంజుతూ అమ్మాయిలను సరఫరా చేస్తున్నారు బ్రోకర్లు. గత కొన్ని రోజులుగా పోలీసులు కొరడా ఝలిపించడంతో నిర్వాహకుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా.. అతిథి గ‌ృహాల పేరిట..!

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా.. అతిథి గ‌ృహాల పేరిట..!


విశాఖపట్నం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. పేకాట, వ్యభిచారం పోలీసులకు సవాల్‌గా మారిన నేపథ్యంలో ఉక్కుపాదం మోపుతున్నారు. మొన్నటి వరకు పేకాట స్థావరాలపై దాడులు చేస్తూ పేకాట పాపారావులకు నిద్ర లేకుండా చేశారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టి పేకాట రాయుళ్ల గుండెల్లో గుబులు పుట్టించారు. ఆ క్రమంలో వ్యభిచారం దందాపై కూడా ఫోకస్ పెట్టడం చర్చానీయాంశమైంది.

అతిథి గ‌ృహాల పేరిట వ్యభిచారం దందా జోరుగా సాగుతోందనే సమాచారం మేరకు పోలీసులు అలర్టయ్యారు. ఈ నేపథ్యంలో గెస్ట్ హౌజ్‌లు, లాడ్జీల్లో విస్త‌ృత తనిఖీలు చేపట్టారు. దాదాపు రెండు వారాల నుంచి అదే పనిలో పడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి గుట్టుగా అమ్మాయిలను తీసుకొస్తూ.. కొంతమంది బ్రోకర్లు వ్యభిచారం దందా జోరుగా సాగిస్తుండటంతో వారికి కత్తెర వేసేందుకు సిద్ధమయ్యారు.

విదేశాలకు వస్తువులు పంపడం ఇప్పుడు చాలా ఈజీ గురూ..!విదేశాలకు వస్తువులు పంపడం ఇప్పుడు చాలా ఈజీ గురూ..!

పోలీసుల దాడులు.. వ్యభిచారానికి అడ్డుకట్ట..!

పోలీసుల దాడులు.. వ్యభిచారానికి అడ్డుకట్ట..!


డాబా గార్డెన్స్, సీతమ్మధార, బీచ్ రోడ్డు, పాండురంగాపురం తదితర ప్రాంతాల్లో వ్యభిచారం జోరుగా సాగుతోందనే సమాచారంతో పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. బుధవారం, గురువారం నాడు పలు చోట్ల తనిఖీలు చేయడంతో కొంతమంది యువతులతో పాటు విటులు అడ్డంగా దొరికిపోయారు.
బుధవారం నాడు రాత్రి ఓ గెస్ట్ హౌజ్‌లో ఓ యువతితో పాటు ఇద్దరు విటులు పట్టుబడ్డారు.

అదే క్రమంలో గురువారం నాడు కూడా బీచ్ రోడ్డులోని అతిథి గ‌ృహాల పేరిట నడుస్తున్న ఆరు ఫ్లాట్లపై పోలీసులు దాడులు చేశారు. అక్కడ వ్యభిచారం జరుగుతుందని తేలడంతో ఆ ఆరు ఫ్లాట్లను సీజ్ చేశారు.

అనుమతులున్నాయా.. నిబంధనలు పాటిస్తున్నారా?

అనుమతులున్నాయా.. నిబంధనలు పాటిస్తున్నారా?


అతిథి గృహాల పేరిట ఫ్లాట్లను అద్దెకు తీసుకుని అందులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఘటనలు ఇటీవల చాలా బయటపడుతున్నాయి. అద్దె ఎక్కువగా వస్తుండటంతో యజమానులు కూడా అక్కడ ఏం జరుగుతున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే అలాంటి అపార్టుమెంట్లపై పోలీసులు ద‌ృష్టి సారించినట్లు తెలుస్తోంది. అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడబోమంటున్నట్లు సమాచారం. అంతేకాదు అతిథి గృహాలకు అసలు అనుమతులు తీసుకుంటున్నారా లేదా అనే విషయంలో కూడా ఆరా తీస్తున్నారు. అంతేకాదు లాడ్జీల్లో కూడా ఎంతమంది యజమానులు నిబంధనలు పాటిస్తున్నారనే విషయంపై కూడా కన్నేశారు.

English summary
In addition to the beauty of nature, the prostitution is going fast in Visakhapatnam. The Brokers are continuing prostitution with large numbers of girls from other states. In the name of the guest houses, they doing this business. Police were attacked some guest houses and lodges, arrested girls and youngsters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X