ప్రియుడ్ని నమ్మి వెళితే.. లా విద్యార్థినిపై గ్యాంగ్‌రేప్: నలుగురు అరెస్ట్
విశాఖపట్నం: ప్రేమించిన వ్యక్తే అని నమ్మి వెళితే ఓ యువతిపై ఆమె ప్రియుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేగాక, అతని స్నేహితులతో కలిసి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. బాధితురాలు న్యాయ విద్యార్థి కావడం గమనార్హం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
ప్రధాన నిందితుడు వంశీతోపాటు అతని స్నేహితులు ఆనంద్, జగదీశ్, రాజేశ్‌లను బుధవారం అరెస్ట్ చేసిన పోలీసులు.. కోర్టులో హాజరుపర్చారు. నిందితుల్లో ముగ్గురు న్యాయ విద్య అభ్యసిస్తున్నవారే కావడం గమనార్హం. మరొకరు ఓ ప్రైవేట్ మోటార్స్ కంపెనీలో క్యాషియర్‌గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఏపీలోని విశాఖకు చెందిన ఓ యువతి (20) న్యాయ విద్య అభ్యసిస్తోంది. ఈ క్రమంలో సహ విద్యార్థి వంశీతో స్నేహం ఏర్పడి, ప్రేమగా మారింది. ఈ ఏడాది ఆగస్టు 10న కంబాలకొండకు వెళ్లిన సమయంలో యువతి నిరాకరించినా వంశీ బలవంతంగా శారీరకంగా అనుభవించాడు. ఆగస్టు 13న ఉదయం 11 గంటలకు ఆ యువతిని ద్విచక్రవాహనంపై డాబా గార్డెన్స్‌లోని తన స్నేహితుడు ఆనంద్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఆమెను బలవంతం చేసి మరోసారి శారీరకంగా కలిశాడు.
అయితే, ఈ సమయంలో రహస్యంగా వీడియా తీసిన వంశీ స్నేహితులు ఆనంద్, జగదీశ్, రాజేశ్ గదిలోకి వచ్చి ఆ వీడియోను చూపించి ఆమెను బెదిరించారు. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ఆమెపై అత్యాచారం చేశారు. నిందితుల్లో ముగ్గురు న్యాయ విద్య అభ్యసిస్తున్నారు. మరొకరు ఓ ప్రైవేటు మోటార్స్ కంపెనీలో క్యాషియర్‌గా పని చేస్తున్నాడు. స్నేహితులతో కలిసి ప్రియుడే దగ్గరుండి అత్యాచారం చేయించడంతో ఆమె నిలదీసింది. దీంతో వంశీ యువతిని బెదిరించడం మొదలుపెట్టాడు. ఈ విషయం బయటకు తెలిస్తే కుటుంబం పరువు పోతుందని భావించిన యువతి మౌనంగా ఉండిపోయింది.
కాలేజీకి కూడా వెళ్లకుండా యువతి ఇంటి వద్దే ఉండిపోయింది. అయినా మళ్లీ తమ కోరిక తీర్చమని రెండు నెలలుగా వంశీ స్నేహితులు ఫోన్ చేసి వేధిస్తున్నారు. వంశీ కూడా ఫోన్ చేసి తన స్నేహితులు చెప్పినట్లు చేయాలని ఒత్తిడి చేయడంతో బాధితురాలు తీవ్ర మనోవేదనకు గురై సోమవారం తెల్లవారుజామున ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కాపాడారు. ఏం జరిగిందని ప్రశ్నించడంతో ఆమె విషయం తెలిపింది. ఈ క్రమంలో బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు తాజాగా నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications