ఏపీలో అదొక దుర్మార్గమైన మతం..: స్వరూపానందేంద్ర స్వామి కీలక నిర్ణయం..!!
విశాఖపట్నం: విశాఖ శారద పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వైఎస్ జగన్ ఆధ్యాత్మిక గురువుగా భావిస్తుంటారాయనను. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలోనూ ఆయనను పలుమార్లు కలుసుకున్నారు వైఎస్ జగన్. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భాలు ఉన్నాయి.

పీఠం వార్షికోత్సవానికి..
ఏదైనా కీలక నిర్ణయాలను తీసుకోదలిచినప్పుడు- స్వరూపానందేంద్ర సరస్వతిని వైఎస్ జగన్ సంప్రదిస్తుంటారనే ప్రచారం కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీస్వాత్మానందేంద్ర సరస్వతి- ముఖ్యమంత్రిని కలిశారు. తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో భేటీ అయ్యారు. విశాఖ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను ఆయనకు అందజేశారు. ఈ మహోత్సవాలకు హాజరు కావాలని ఆహ్వానించారు. వచ్చే జనవరి 27వ తేదీ నుంచి 31వ తేదీ వరకు విశాఖపట్నం పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలో ఈ వార్షిక మహోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి.

స్వరూపానందేంద్ర కీలక వ్యాఖ్యలు..
ఈ పరిణామాల మధ్య స్వరూపానందేంద్ర సరస్వతి కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్రంలో మత మార్పిడి విపరీతంగా పెరిగిందని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్లు యథేచ్ఛగా ప్రయత్నాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. అటువంటి దుర్మార్గమైన మతం..అంటూ ఆయన మండిపడ్డారు.

ఎవరూ మతం మారొద్దు..
ఎవరూ కూడా మతం మారకూడదని.. మన మతంలో మనం ఉండాల్సిన అవసరం ఉందని స్వామి స్వరూపానందేంద్ర స్పష్టం చేశారు. మన మతంలో మనం ఉండాలనే పిలుపును ఇవ్వడానికి డిసెంబర్ 25వ తేదీ నాడు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నామని ఆన చెప్పారు. వాటిని తక్షణమే అమలులోకి తీసుకొచ్చామని వివరించారు. గిరిజన ప్రాంతాలను అన్యమతాలు టార్గెట్ చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మత మార్పిళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు.

అడ్డుకోవడానికే..
గిరిజన ప్రాంతాల్లో మత మార్పిళ్లను అడ్డుకోవడానికి ఇవ్వాళ గిరిజన, ఆదివాసీ, ఏజెన్సీ ప్రాంతాల్లో భగవద్గీతను పంపిణీ చేశామని స్వరూపానందేంద్ర సరస్వతి తెలిపారు. ఏజెన్సీల్లో నివసించే గిరిజన తల్లులు, చిన్నాపెద్ద అనే తేడా లేకండా ప్రతి ఒక్కరికీ వైద్య సదుపాయాన్ని కల్పించడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నామని అన్నారు. ఏజెన్సీలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఆయన వివరించారు.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications