• search
  • Live TV
విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తండ్రి చనిపోయినప్పుడు కోల్‌కత హోటల్‌లో జగన్ ఏం చేశాడు? రచ్చలో రిలయన్స్‌నూ లాగిన అయ్యన్న

|

విశాఖపట్నం: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం నేతల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. ఈ రెండు పార్టీల నేతలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో చెలరేగిపోతున్నారు. పాత విషయాలను తవ్విపోసుకుంటున్నారు. సాగర నగరం విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ నేతలు పాల్పడినట్లుగా అనుమానిస్తోన్న భూముల కబ్జా వ్యవహారం దీనికి కేంద్రబిందువుగామారింది. భూ ఆక్రమణ ఆరోపణల నుంచి మరింత లోతులకెళ్లింది ఈ విమర్శల వ్యవహారం.

వన్ ఇండియా స్పెషల్ పేజ్: మీ ఫ్రెండ్స్‌కు ఈ - గ్రీటింగ్స్‌తో న్యూఇయర్ విషెస్ చెప్పండి.. అంతేకాదు ఆఫర్లు కూడా చూడండి

కబ్జా ఆరోపణలపై టీడీపీ భగ్గు..

కబ్జా ఆరోపణలపై టీడీపీ భగ్గు..

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం, వైఎస్ వివేకాంద రెడ్డి హత్యోదంతం.. రిలయన్స్‌‌నూ రచ్చలోకి లాగారు.

విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబుపై వైఎస్ఆర్సీపీ రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డి కబ్జా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. విశాఖపట్నంలో విలువైన 300 ఎకరాలకు పైగా భూములను వెలగపూడి ఆక్రమించుకున్నారని విమర్శించారు. ఈ ఆరోపణలు నిజం కాదంటూ తాను ప్రమాణ స్వీకారం చేస్తానంటూ ఆయన సాయిరెడ్డికి సవాల్ విసిరారు.

శ్రీవారిని దర్శించిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్: భార్యతో కలిసి ఏడుకొండలవాడి సేవలో

కోల్‌కత హోటల్‌లో జగన్ ఏం చేశారు?

కోల్‌కత హోటల్‌లో జగన్ ఏం చేశారు?

ఈ రచ్చ ఇలా కొనసాగుతుండగానే.. ఇందులోకి టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎంట్రీ ఇచ్చారు. విజయసాయి రెడ్డిని టార్గెట్‌గా చేసుకున్నారు. వెలగపూడి రామకృష్ణ బాబుపై చేసిన ఆరోపణలలను దమ్ము ఉంటే నిరూపించాలని అయ్యన్న పాత్రుడు సాయిరెడ్డికి ఛాలెంజ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఘాటు విమర్శలు సంధించారు. తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో జగన్ కోల్‌కతలో ఓ హోటల్‌లో గడిపారని, అక్కడ ఆయనం ఏం చేశారనేది తనకు తెలుసునని అన్నారు.

 రిలయన్స్ మనిషికి ఎంపీ సీటు ఎందుకు?

రిలయన్స్ మనిషికి ఎంపీ సీటు ఎందుకు?

తండ్రి భౌతికకాయం సంతకాల సేకరణ ఎందుకు చేసాడో తనకు తెలుసునని అయ్యన్న పాత్రుడు చెప్పారు. రిలయన్స్ యాజమాన్యం తన తండ్రి హత్యకు కారణమైందని ఆరోపించిన వైఎస్ జగన్.. అదే సంస్థకు చెందిన డైరెక్టర్‌కు ఎంపీ సీటు ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. దానికి సమాధానం తన వద్ద ఉందని అన్నారు. రిలయన్స్ సంస్థకు చెందిన మనిషికి రాజ్యసభ సీటు ఇచ్చే విషయంలోో విజయసాయి రెడ్డి ఎంత బ్రోకరేజ్ తీసుకున్నాడో కూడా తనకు తెలుసునని అన్నారు. వైఎస్ జగన్‌కు సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి ఎలా పోయాడో తెలియదని,. సొంత మామ ఎలా మరణించాడో తెలియదని ఎద్దేవా చేశారు.

 ఎక్కువ లాగితే.. తెగుద్ది

ఎక్కువ లాగితే.. తెగుద్ది

`చివరకు తండ్రి మరణం వెనుక కూడా మీ హస్తం ఉందా అనే అనుమానాలు ఉన్నాయి..`అని అయ్యన్న పాత్రుడు అన్నారు. వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి ఎంత రాక్షస జాతికి చెందినవారో అందరికీ తెలుసునని చెప్పారు. వంగవీటి మోహనరంగా హత్యలో వైఎస్ పాత్ర ఏమిటో విజయవాడ మొత్తం తెలుసని తెలిపారు. అలాంటి పార్టీకి చెందిన సాయిరెడ్డి కూడా హత్యలు గురించి మాట్లాడే వాడేనని చురకలు అంటించారు. ఎక్కువ లాగితే, తెగిపోద్దని హెచ్చరించారు. వెలగపూడిపై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని ప్రతిసవాల్ విసిరారు.

English summary
Telugu Desam Party senior leader and former minister Ayyanna Patrudu slams YSR Congress Party Rajya Sabha member V Vijayasai Reddy on his comments on Party MLA Velagapudi Ramakrishna Babu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X