ఏపీకి అమిత్ షా- చంద్రబాబు ఏం చేయబోతున్నారు?
విశాఖపట్నం: భారతీయ జనతా పార్టీ హెవీ వెయిట్, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. ఏపీ పర్యటనకు రానున్నారు. ఆదివారం విశాఖపట్నంలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. విశాఖ రైల్వే గ్రౌండ్స్‌లో ఈ బహిరంగ సభ ఏర్పాటు కానుంది. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణం వద్ద పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. భద్రతా చర్యలను నగర పోలీస్ కమిషనర్ పరిశీలించారు.
ఆదివారం సాయంత్రం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా విశాఖపట్నంలో ల్యాండ్ కానున్నారు అమిత్ షా. 7 గంటలకు రైల్వే గ్రౌండ్స్‌లో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఎంపీ జీవీఎల్ నరసింహా రావు సహా ఇతర పార్టీ సీనియర్ నాయకులు ఈ సభలో పాల్గొంటారు. రాత్రికి విశాఖలోనే బస చేస్తారు అమిత్ షా.

బీజేపీతో పొత్తు కోసం తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు సాగిస్తోన్న నేపథ్యంలో- ఇక అందరి దృష్టీ ఆయన మీదే నిలిచింది. ఇటీవలే ఆయన ఢిల్లీకి వెళ్లొచ్చారు. అమిత్ షాతో సమావేశం అయ్యారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డానూ కలుసుకున్నారాయన. అమిత్ షా- జేపీ నడ్డాతో భేటీ జరగలేదనేది వాదనలు కూడా వినిపిస్తోన్నాయి.
జరిగివుంటే దీనికి సంబంధించిన ఫొటోలను తెలుగుదేశం పార్టీ నాయకులు బయటపెట్టేవారనీ చెబుతోన్నారు. ఈ పరిస్థితుల్లో ఇక స్వయంగా అమిత్ షాయే రాష్ట్రానికి రాబోతోండటంతో చంద్రబాబు కార్యాచరణ ప్రణాళిక ఎలా ఉంటుందనేది ఆసక్తి రేపుతోంది. అమిత్ షాను కలుసుకోవడానికి టీడీపీ నాయకులు ఇప్పటికే తమ ప్రయత్నాలు మొదలు పెట్టారని చెబుతున్నారు.

అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం విశాఖపట్నానికే చెందిన టీడీపీ శాసన సభ్యుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్ తనవంతు ప్రయత్నాలు సాగిస్తోన్నారని చెబుతున్నారు. అపాయింట్‌మెంట్ దొరికితే- గంటా, అచ్చెన్నాయుడు సహా మరికొందరు నాయకులతో కూడిన టీడీపీ ప్రతినిధుల బృందం అమిత్ షాను కలుసుకునే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.
-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications