Vizag Steel బిడ్ల గడువు క్లోజ్: 29 సంస్థల ఆసక్తి, తెలంగాణ, ఏపీ వెనకడుగు
విశాఖపట్నం: వర్కింగ్ క్యాపిటల్, ముడిసరుకు కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్(EOI) బిడ్ల దాఖలుకు గడువు గురువారంతో ముగిసింది. మొత్తం 29 సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఏడు విదేశీ సంస్థలు ఈవోఐ దాఖలు చేశాయని కార్మిక సంఘం నేత అయోధ్యరామ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు ఆసక్తి చూపినట్లు సమాచారం లేదన్నారు.
ఇక సింగరేణి కాలరీస్ నుంచి కూడా ప్రతిపాదన రాలేదని కార్మిక సంఘాలు తెలిపాయి. ఎన్ఎండీసీ వంటి సంస్థలు కూడా ఈవోఐ దాఖలు చేయలేదని అయోధ్యరామ్ తెలిపారు. తొలుత నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం.. శనివారంతో గడువు ముగిసినప్పటికీ ఆర్ఐఎన్ఎల్ మరో ఐదు రోజులు అంటే గురువారం వరకు గడువు పొడిగించింది. నేటి మధ్యాహ్నం 3 గంటల వరకు బిడ్డింగ్ గడువు ముగిసింది.

కాగా, టెండర్ ప్రక్రియలో విదేశీ కంపెనీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటున్నాయి కార్మిక సంఘాలు. బిడ్డింగ్ కు ఆలస్యం జరగడానికి గల కారణాలను తెలంగాణ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలంటున్నాయి. ఈవోఐకి రాని సంస్థలు కూడా టెండర్లకు వెళ్లే అవకాశం ఉందంటున్నారు. మహానది కోల్ ఫీల్డ్స్ తో పోలిస్తే సింగరేణి నుంచి బొగ్గు తీసుకుని రావడం ఆర్థికంగా భారమైన వ్యవహారంగా చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఈవోఐకి వచ్చినా.. రాకపోయినా పార్లమెంటులో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలని కార్మిక సంఘాలు, పోరాట కమిటీ నాయకులు కోరుతున్నారు.
టెండర్లలో పాల్గొంటామని తెలంగాణ ప్రభుత్వం, సింగరేణి వెనుకడుగు వేయడం చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ అడ్డుకునేందుకు తామే బిడ్ వేస్తామని తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రులు ప్రకటించిన విషయం తెలిసిందే. సింగరేణి సంస్థ ప్రతినిధులు వెళ్లి స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో చర్చలు కూడా జరిపారు. హడావిడి చేసి వెనకంజ వేయడం తెలుగు రాష్ట్రాల్లో చర్చకు దారితీసింది.
మరోవైపు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. సింగరేణి కార్మికుల కష్టాన్ని విశాఖ స్టీల్‌లో పెట్టడం ఏంటని ప్రశ్నించారు కిషన్ రెడ్డి. సింగరేణి సంస్థలో కేసీఆర్ కుటుంబ జోక్యం పెరిగిందని.. అసలు సంస్థ ఆర్ధిక స్థితిగతులు, కార్మికులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు కేంద్రమంత్రి. సింగరేణి సంస్థ అప్పులపాలైందని, పర్మినెంట్ ఉద్యోగులు భారీగా తగ్గిపోయారని వ్యాఖ్యానించారు.
-
డోర్నకల్–గద్వాల్ కొత్త రైల్వే లైన్ తో పాటు రైల్వే ప్రాజెక్ట్ లపై కేంద్రం శుభవార్త! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications