విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్..? ఇంకా ఖరారు కానీ ముహుర్తం: విజయసాయిరెడ్డి
ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ రాబోతోందని తెలిపారు. దానికి సంబంధించి ముహూర్తం ఇంకా ఖరారు కాలేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పరిపాలన రాజధాని తరలింపుకు సంబంధించి సంకేతాలు అందుతున్నాయని వెల్లడించారు.

44 కి.మీ రోడ్ల అభివృద్ది..
ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ విశాఖపట్టణానికి రాబోతోందని పదే పదే చెప్పడం జరిగిందని, దీనికన్నా ఎక్కువ విషయాలు ఇప్పుడు చెప్పడం సరికాదన్నారు. విశాఖ పరిపాలన రాజధానిపై గతంలో కూడా విజయసాయి రెడ్డి పలు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. విశాఖలో 44 కిలోమీటర్ల ఆరు లైన్ల రోడ్ల అభివృద్ధి చేయడం, పలు మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది ప్రభుత్వం. కొద్ది రోజుల్లో సీఎం జగన్ ఇక్కడి నుంచే పరిపాలన చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

త్వరలోనే ఏర్పాటు
ఎలాంటి పరిపాలన భవనాలు కావాలనే దానిపై అధికార యంత్రాంగం ఓ అంచనాకు వచ్చినట్లు సమాచారం. విలువైన ప్రభుత్వ భూములతోపాటు, ఇతర స్థలాలు, భవనాలు ఇక్కడ ఉన్నాయి. కోర్టులో కొన్ని కేసులు పెండింగ్‌లో ఉండడంతో పరిపాలన రాజధానిని తరలిస్తే..న్యాయపరంగా చిక్కులు వస్తాయని ప్రభుత్వం భావిస్తోందని తెలుస్తోంది. కొద్ది రోజుల్లోనే వీటికి పరిష్కారం లభిస్తుందని.. త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధాని తరలనుందని భావిస్తున్నారు.

ఇలా వాయిదా..?
అమరావతిని శాసన రాజధాని, పరిపాలన రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలును ఏర్పాటు చేస్తూ సీఎం జగన్ ప్రభుత్వం గెజిట్ నోట్ ఇవ్వడంతో వివాదాలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఏపీ అసెంబ్లీ, గవర్నర్ ఆమోదించి చట్టాలుగా మారినా..రాజధాని బిల్లులపై హైకోర్టులో పిటిషన్ లు దాఖలైన సంగతి తెలిసిందే. దీంతో వాయిదా పడుతూ వస్తోంది. కానీ మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ సర్కార్ మొండి వైఖరితో ముందుకెళుతోంది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications