విశాఖకు వందే భారత్ రైళ్లు: ఈ రెండు మార్గాల్లో: రైల్వేమంత్రికి కీలక ప్రతిపాదనలు
సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య పట్టాలెక్కిన వందే భారత్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఆక్యుపెన్సీ రేషియో భారీగా ఉంటోంది. ఈ నేపథ్యంలో విశాఖకు మరిన్ని రైళ్లను కేటాయించాలంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విజ
విశాఖపట్నం: దేశవ్యాప్తంగా పట్టాలెక్కిన అత్యాధునిక వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు ప్రయాణికుల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తోంది. ఏపీ-తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లో ఈ రైళ్లకు రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది. వెయిటింగ్ లిస్ట్ భారీగా ఉంటోంది. ఇప్పటివరకు 10 రైళ్లు వేర్వేరు రాష్ట్రాల్లో వివిధ నగరాల మధ్య రాకపోకలు సాగిస్తోన్నాయి. ఈ సిరీస్ లో ఎనిమిదో రైలు సికింద్రాబాద్- విశాఖపట్నం మధ్య తిరుగాడుతోంది.

ప్రయాణికుల ఆదరణ..
సికింద్రాబాద్- విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ 140 శాతం ఆక్యుపెన్సీ రేషియోను రికార్డు చేసింది. ఇతర ఎక్స్ ప్రెస్ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ల రేట్లు రెట్టింపు అయినప్పటికీ ప్రయాణికులు పెద్దగా పట్టించుకోవట్లేదు. ఫలితంగా వారి తాకిడి ఏ మాత్రం తగ్గట్లేదు. సమయం, వేగానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు. వివిధ నగరాల మధ్య వందలాది కిలోమీటర్ల మేర రాకపోకలు సాగించే విషయంలో సమయానికి గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఉద్దేశంతో వందే భారత్ రైళ్లపై ఆధారపడుతున్నారు.

నో స్లీపర్ కోచ్..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వందే భారత్ రైళ్లన్నీ ఛైర్ కార్లే. ఇందులో స్లీపర్ కోచ్, బెర్త్ సౌకర్యం లేదు. తాజాగా ప్రయాణికుల నుంచి లభిస్తోన్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని వందే భారత్ స్లీపర్ వెర్షన్‌ను పట్టాల మీదికి తీసుకుని రావడానికి అధికారులు అన్ని చర్యలు తీసుకుంటోన్నారు. దూర ప్రయాణాలు సాగించే వారికి వెసలుబాటుగా సెమీ హైస్పీడ్ స్లీపర్ రైళ్లను వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకుని వస్తామని స్పష్టం చేస్తోన్నారు.

కీలక ప్రతిపాదనలు..
ఈ పరిణామాల మధ్య విశాఖపట్నానికి మరిన్ని వందే భారత్ రైళ్లను కేటాయించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ఇప్పుడున్న సికింద్రాబాద్-విశాఖపట్నం సర్వీస్ 140 శాతం ఆక్యుపెన్సీ రేషియోను రికార్డ్ చేసిన నేపథ్యంలో మరిన్ని అందుబాటులోకి తీసుకుని రావాల్సిన అవసరం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చీఫ్ వీ విజయసాయిరెడ్డి చెప్పారు. ఈ సర్వీస్ కు లభిస్తోన్న ఆదరణ- విశాఖకు మరిని వందే భారత్ రైళ్లను మంజూరు చేయాల్సిన అవసరాన్ని చాటి చెబుతోందని అన్నారు.
The tremendous success of the Vizag-Secunderabad Vande Bharat Express shows the need to introduce more trains in AP to increase connectivity. Vizag needs to be connected with Bengaluru & Chennai with the planned sleeper Vande Bharat. Request to Rly. Min. AshwiniVaishnaw ji. pic.twitter.com/DynHXFMXBW
— Vijayasai Reddy V (VSReddy_MP) February 20, 2023
విశాఖ నుంచి..
విశాఖపట్నం - బెంగళూరు, విశాఖపట్నం - చెన్నై మార్గాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను నడిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ కు ప్రతిపాదనలను పంపించారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి. వందే భారత్ స్లీపర్ ఎక్స్ ప్రెస్ లతో పాటు విశాఖపట్నానికి కేటాయించాల్సిన వాటి సంఖ్యను పెంచాలని విజ్ఞప్తి చేశారు. స్లీపర్ కోచ్ లకు కూడా మంచి ఆదరణ లభిస్తుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications