విషాదం: ఆర్టీసీ బస్సులోనే ఉరివేసుకుని కండక్టర్ ఆత్మహత్య
టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులో డ్యూటీలో ఉన్న కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి(55) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో చోటు చేసుకుంది.
వరంగల్: టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సులో డ్యూటీలో ఉన్న కండక్టర్ గార్లపాటి మహేందర్ రెడ్డి(55) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు డివిజన్ కేంద్రంలో చోటు చేసుకుంది.అనారోగ్యంగా ఉండటంతో మార్చి 9 నుంచి 12వ తేదీ వరకు మహేందర్ సెలవులో ఉన్నారు.
అయితే, ఆదివారం వరకు సెలవు ఉన్నా.. నిన్న ఉదయం 11 గంటలకు డిపోకు వచ్చిన మహేందర్ డ్యూటీ వేయించుకున్నాడు. అయితే, అప్పట్నుంచి ఆయన కనిపించకుండా పోయాడు. సిబ్బంది ఫోన్ చేసినా స్పందించలేదు. చివరకు డిపో ఆవరణలో పార్కింగ్ చేసి ఉన్న ఓ బస్సులో తన టవల్‌తో ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు.

ఆర్టీసీ సిబ్బంది వెంటనే అధికారులకు ఈ ఘటనపై సమాచారం ఇచ్చారు. అధికారులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం నిమిత్తం మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య అరుణ, కుమారులు విక్రమ్, వినయ్‌లు ఉన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మహేందర్ భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు, మహేందర్ విధి నిర్వహణలో ఉండి.. బస్సులోనే ఉరివేసుకోవడం తీవ్ర బాధను కలిగించిందని జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ కమల్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాజమాన్యం ఎంత వేధిస్తే ఇలా ఆత్మహత్యకు పాల్పడ్డాడో అని ఆందోళన వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డి ఆత్మహత్యకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు ఆయన కుటుంబానికి పరిహారం ఇచ్చి ఆదుకోవాలన్నారు. కండక్టర్ బస్సులోనే ఆత్మహత్య చేసుకున్నారంటే ఆర్టీసీలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవాలన్నారు తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పీ కమల్ రెడ్డి. చాలీచాలని జీతాలతో, అధికారుల వేధింపులతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కుటుంబ పోషణకై ఉద్యోగులు ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. మహేందర్ రెడ్డి కుటుంబానికి రూ. 30 ఆర్థిక సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
-
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications