వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిలికానాంధ్రకథల పోటీ విజేతలు

By Staff
|
Google Oneindia TeluguNews

సిలికానాంధ్ర- రచన మాసపత్రికల సంయుక్తఆధ్వర్యంలో జరిగిన కథల పోటీ ఫలితాలువెలువడ్డాయి. బహుమతి పొందినకథలకు మొత్తం 30 వేల రూపాయలుపంచుతారు. విశాఖపట్నానికి చెందిన ఆదూరివెంకట సీతారామమూర్తి రాసినతెరువు కథకు ప్రథమబహుమతి లభించింది. ప్రథమ బహుమతికింద పది వేల రూపాయలు ప్రదానంచేస్తారు. ఎం.వివి. సత్యనారాయణ(హైదరాబాద్‌) రాసిన ఆమెకథ ద్వితీయ బహుమతి గెలుచుకుంది. ఈకథకు ఐదు వేల రూపాయలు ప్రదానంచేస్తారు. వారణాసి నాగలక్ష్మి(హైదరాబాద్‌) రాసిన ఆసరా కథకుతృతీయ బహుమతి దక్కింది. ఈ కథకు 3వేల రూపాయలు ఇస్తారు.

మరోఏడు కథలకు ప్రత్యేక బహుమతులుప్రకటించారు. ఈ బహుమతి కింద ఒక్కోకథకు వేయి రూపాయలేసి ప్రదానంచేస్తారు. ఈ బహుమతుల గెల్చుకున్నకథలు - వీడ్కోలు : ఇలపావులూరీమురళీమోహన రావు(హైదరాబాద్‌), పుడమి - పొడిమి: శ్రీవిరించి(చెన్నై), ఒక దీపం వెలిగించు: ఎమ్యెస్సీగంగరాజు (బెర్హంపూర్‌), పాఠం : మూలారవికుమార్‌ (హైదరాబాద్‌), ఈ పాపంఎవరిది? : నిశాపతి (హైదరాబాద్‌),మనసులో తడి : కోడూరి దుర్గానాగరాజు(హైదరాబాద్‌), రాయంచ : సురేంద్రకె. దారా (అమెరికా)

వాటితోపాటు పది ప్రోత్సాహక బహుమతులు కూడాప్రకటించారు. ఈ బహుమతి కింద ఒక్కోకథకు 500 రూపాయల చొప్పున ప్రదానంచేస్తారు. ప్రోత్సాహక బహుమతిగెలుచుకున్న కథలు- అంతరం :మంజరి (విజయనగరం), అడవి పూలు : బోయజంగయ్య (నల్లగొండ), గురభ్యోం నమః: వసుంధర (హైదరాబాద్‌), వీడా నాకొడుకటంచు: బాబి (హైదరాబాద్‌),పరిచ్యుతుడు : కె.వి. రమణారావు(హైదరాబాద్‌), ఛాయామోహం : ఎస్‌. ఎం.నండూరి (హైదరాబాద్‌), అందమైనపువ్వు : మృత్యుంజయుడుతాటిపాములు (అమెరికా), దృశ్యకావ్యం :టి. ఎస్‌. ఎ. కృష్ణమూర్తి (మదనపల్లి),నేనూ - కర్ణుడూ : సుధారమ(డొంబివిలి), అగాధం : శారద (సౌత్‌ఆస్ట్రేలియా).

శ్రీధర(శ్రీధర రాధాకృష్ణమూర్తి), కె.వి. ఎస్‌.రామారావు, కె.వి. గిరిధర రావు,శివచరణ్‌ న్యాయనిర్ణేతలుగావ్యవహరించినట్లు కిరణ్‌ప్రభతెలిపారు. బహుమతి పొందిన ఈ కథలనుసిలికానాంధ్రవారి వార్షిక సంచికసుజరంజని/ వెబ్‌ మాసపత్రిక సుజనరంజనిలలోనూ, రచనలోనూప్రచురించనున్నట్లు ఆయనతెలిపారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X