ఎన్నారైల వన భోజనం

తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (టిసిఎ) అధ్యక్షుడు బిక్షం పాలబిందెల ఆహ్వానం పలికారు. భోజనాలను రాజు యాసాల ఏర్పాటు చేశారు. అతిథి రెస్టారెంట్ కొన్ని ఆహార పదార్థాలను అందజేసింది. భోజనాలు ముగిసిన వెంటనే ఉమా చింతలపాటి పిల్లలతో పాటలు పాడే, నృత్యాలు చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలు శిల్ప, ఐశ్వర్య, హంసిక, శ్వేత, సుమస్వర, పెద్దలు ఉమ, చూడామణి జయ, అనిత పాలబిందేల తమ పాటలతో, నృత్యాలతో అలరించారు.
టిసిఎ ఉపాధ్యక్షుడు అర్షద్ హుస్సేన్ బింగో గేమ్, రన్నింగ్ రేస్, మ్యూజికల్ బాల్స్, టగ్ ఆఫ్ వార్ వంటి కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విజయ చవ్వా, గట్టు ప్రసాద్, శ్రవణ్ బెల్లాల్, గండి తిరుపతయ్య, చక్రి రవడం, ప్రసాద్ మంగిన, సైదీశ్ అజ్జన్, శ్రీనివాస్ గుజ్జా, బాలరాజ్ గార్లపాటి, గడింశెట్టి సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులు హాజరయ్యారు. స్పాన్సరర్స్, అక్కడికి వచ్చిన వారికి టిసిఎ కోశాధికారి భాస్కర్ మద్ది కృతజ్ఞతలు తెలిపారు.












Click it and Unblock the Notifications