బే ఏరియాలో తెలంగాణపై సమావేశం

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీలు, విద్యార్దులు, ఉద్యోగులు తదితరులు జెఎసిగా ఏర్పడడం పట్ల ఎన్నారైలు హర్షం వ్యక్తం చేసారు. ఉద్యమ కార్యాచరణ సమితికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నేతలు విడివిడిగా, కలివిడిగా ఉన్నప్పుడు ఉద్యమ పరిస్థితులను ఎన్నారైలు బేరీజు వేసి సంతృప్తి వ్యక్తం చేసారు. ఉద్యమంలో హింసాత్మక ఘటనలకు తావులేకుండా సహాయ నిరాకరణ వంటి శాంతియుత పద్దతుల ద్వారా తెలంగాణ కోసం పోరాడాలని వారు సూచించారు. వ్యాపార సముదాయాలపై తెలంగాణ పేర్లు లిఖించమని కోరడం, తెలంగాణేతర వస్తువులను బహిష్కరించడం వంటి పద్దతులను వారు సూచించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించిన ఎన్నారైలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు.












Click it and Unblock the Notifications