అమెరికాలో వివిధ నగరాల్లో నవంబరు 19 నుంచి 28 వరకూ ప్రవాసాంధ్రులు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలను నిర్వహించనున్నట్లు ఏపీ ఎన్నారై ఫోరం ఛైర్‌పర్సన్ ఎ.శైలజ ఒక ప్రకటనలో తెలిపారు. డెట్రాయిట్, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, న్యూజెర్సీ, అట్లాంటా, డల్లాస్, శాన్‌ఫ్రాన్సిస్కో నగరాల్లో ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలకు ఎంపీ లగడపాటి రాజగోపాల్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్, గంటా శ్రీనివాసరావు, హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అడుసుమిల్లి జయప్రకాశ్‌లను కూడా ఆహ్వానించామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, ఇతర దేశాల్లోని తెలుగు వారి మధ్య సమైక్యత పెంపొందించేందుకు అమెరికా, కెనడాలోని ప్రవాసాంధ్రులు ఏపీ ఎన్నారై ఫోరంను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.