2జి స్పెక్ట్రమ్ పై ఎన్నారైల లేఖలు

2జి స్పెక్ట్రమ్ లో నష్టపోయిన 46 బిలియన్ డాలర్ల మొత్తం చిన్నదేమీ కాదని, 30 లక్షల పాఠశాల భవనాలు నిర్మించవచ్చునని లేదా వేయి నాగార్జున సాగర్ ఆనకట్టలను నిర్మించవచ్చునని లేదా 2.5 మిలియన్ కొత్త నర్సింగ్ హోమ్ లను పెట్టవచ్చునని సన్నీవాలె లో ఉద్యమాన్ని నడిపిస్తున్న రవీంద్ర నందం అన్నారు. లాస్ ఎంజెల్స్ లో ప్రధానికి లేఖలు రాయడానికి ఎన్నారైలను సమీకరించిన వర్మ దంతలూరి రాజీ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుంభకోణం తీరుపై దినేష్ పగడాల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. లైసెన్సులను రద్దు చేయడం ద్వారా, విండ్ ఫాల్ టాక్స్ లు వేయడం ద్వారా దేశాన్ని మోసం చేసే వారు సామాజిక, రాజకీయ హోదాను కోల్పోవడమే కాకుండా దివాళా తీస్తారనే సందేశం ఇవ్వాలని హూస్టన్ లోని ఎన్నారై హైమా సాగి అన్నారు.












Click it and Unblock the Notifications