అమెరికాలో నవంబర్ 12వ తేదీన ఘోర రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాదుకు చెందిన అర్పణ, అర్చన అనే కవలలు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. వారిలో తీవ్ర గాయాల పాలైన అర్పణ మరణించిన విషయం కూడా తెలిసిందే. ప్రమాదంలో అర్చన వెన్నెముక తీవ్రంగా దెబ్బ తిన్నది. ఆమె ప్రస్తుతం వండేర్ బిల్ట్ ట్రా యూనిట్ లో చికిత్స పొందుతోంది. అర్చన కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఉత్తర అమెరికా తెలుగు సంఘం ఓ విజ్ఞప్తి చేస్తోంది. అర్చనకు నాలుగు గంటల పాటు శస్త్రచికిత్స జరిగింది. ఇంకా ఆమె మాట్లాడలేకపోతోంది. కళ్ల ద్వారా, పెదవుల ద్వారా తమ అభిప్రాయాలను వెల్లడించడానికి ప్రయత్నిస్తోంది. మరో రెండు వారాల పాటు ఆమె ఇంటెన్సివ్ కేర్ ఉండాల్సి వస్తుంది. ఆమె శరీరంలో చలనాన్ని తెచ్చేందుకు మరింత చికిత్స అవసరం. అట్లాంటాలోని షెపర్డ్ పునరావాస కేంద్రంలో చేర్చాల్సిందిగా వైద్యులు సలహా ఇచ్చారు. ఆమెకు ఆరు నెలల పాటు అవుట్ పేషంట్ రిహాబిలిటేషన్ తో పాటు హోమ్ ఫిజికల్ థెరపీ అవసరం. ఇందుకు ఎంతో ఖర్చవుతుంది. దీనికి గాను అర్చన కుటుంబ సభ్యులు విరాళాల రూపంలో ఆర్థిక సాయం కోరుతున్నారు. అందుకు గాను https://natsworld.org/new/donate.php ను క్లిక్ చేయండి. అర్చనను ఆదుకోవడానికి ముందుకు రావాల్సిందిగా ఉత్తర అమెరికా తెలుగు సంఘం కోరుతోంది.