టిడిఎఫ్ సభ్యులతో కోదండరామ్

రెడీ మేడ్ రాజధాని ఆంధ్ర నాయకులకు కనిపించడమే కాకుండా సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, కృష్ణా గోదావరి నదులు పరీవాహక ప్రాంతాలు వారు గుర్తించారని ఆయన చెప్పారు. ఆంధ్ర నాయకులు, మీడియా తెలంగాణను అణచివేశారని చెప్పడానికి ఆయన పలు ఉదాహరణలు చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. శ్రీకృష్ణ కమిటీని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వేయలేదని, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం వేశారని, అయితే నివేదిక తెలంగాణకు అనుకూలంగా వస్తుందని ఆశిస్తున్నామని, అయినా మన లక్ష్యం సాధించే వరకు విశ్రమించకూడదని ఆయన అన్నారు. ప్రసంగం పూర్తయిన తర్వాత టిడిఎఫ్ సభ్యులు వేసిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. తెలంగాణ కోసం పోరాడకపోతే భవిష్యత్తు లేదని ఈ ప్రాంత నాయకులు గుర్తించినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications