ప్రవాసాంధ్ర వనితా వేదిక కార్యక్రమం

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) ఆధ్వర్యంలో 2010 సంవత్సరానికి గానూ మొట్టమొదటిది వనితావేదిక కార్యక్రమం ఇటీవల ఫార్మర్స్ బ్రాంచ్ గ్రంథాలయంలో ఘనంగా జరిగింది. టాంటెక్స్ ఉపాధ్యక్షురాలు, వనితావేదిక కమిటీ చైర్ గీతా దమ్మన్న అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ఎందరో అత్యుత్సాహంగా పాల్గొన్నారు. మొదటగా కమిటీ సభ్యులు ఇందూరెడ్డి మందాడి, సుమన కేతా సంయుక్తంగా ఏర్పాటు చేసిన చర్చా వేదికను నిర్వహించవలసిందిగా అమెరికా తెలుగు సంఘం మరియు ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం పూర్వ అధ్యక్షులు సంధ్య గవ్వాను ఆహ్వానించారు.
తరువాత కమిటీ సభ్యులు కస్తూరి ఇనగంటి, రాజేశ్వరి ఉదయగిరి విన్నూత్న రీతిలో నిర్వహించిన పాటల పోటీ ఆసక్తికరంగా సాగింది. పదికిపైగా బృందాలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ పోటీలకు స్దానిక సంగీత కళాకారులు మీనాక్షి అనిపిండి, రాజేష్ చిలుకూరి న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. స్ధానిక చిన్నారులు కూడా దీనిలో పాల్గొని దేశభక్తి గీతాలను ఆలపించడం ప్రేక్షకులను అలరించింది. అనంతరం కల్యాణి సిద్దార్ధ, గీతా దమ్మన్నకలిసి నిర్వహించిన సినిమా క్విజ్ ఆడియో, వీడియోల ప్రదర్శనతో అధ్యంతం ఆసక్తికరంగా సాగింది.












Click it and Unblock the Notifications