ఓ వ్యక్తిని మృతిచెందే వరకూ కొట్టి అనంతరం మృతదేహాన్ని దహనం చేసిన కేసులో 10 మంది భారతీయులు, ఓ పాకిస్థానీకి దుబాయి క్రిమినల్ కోర్టు బుధవారం జైలు శిక్ష విధించింది. ప్రధాన నిందితుడు ఎమ్మెస్(24), అతని అనుయాయుడు హెచ్‌ఎస్(26)లకు జీవితఖైదు...మరో ఎనిమిది మంది భారతీయులకు పదిహేనేళ్లు, పాకిస్థాన్‌కు చెందిన కారుడ్రైవర్‌కు పదేళ్లు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. అనంతరం తదుపరి విచారణ నిమిత్తం కేసును వచ్చేనెల 7కు వాయిదా వేశారు. నవంబరు 2008లో జరిగిన ఈ ఘటనలో బూట్ లెగ్గర్స్ గ్యాంగ్ సభ్యులు ఓ వ్యక్తిని కత్తులు, పైపులు, కర్రలతో దాడి చేసి హత్య చేసినట్లు స్థానిక పత్రికలు పేర్కొన్నాయి. మరోవైపు నేరాభియోగాన్ని నిందితులు ఖండిస్తున్నారు.