జెపిపై దాడికి ఎన్నారైల ఫైర్

Jayaprakash Narayana
లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాణయణ, కాంగ్రెసు ఎమ్మెల్సీ పాలగుడు వెంకటరావుపై జరిగిన దాడిని, శాసనసభలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడాన్ని ప్రవాసాంధ్రుల సంస్థ పీపుల్స్ ఫర్ లోకసత్తా (పిఎఫ్ఎల్) ఖండించింది. ప్రజాస్వామ్య విలువలను కాలరాసే చర్యగా జెపిపై దాడిని ఆ సంస్థ అభివర్ణించింది. శాసనసభలో గురువారం సంఘటనలు ప్రజాస్వామ్యంపై దాడి అని విమర్శించింది.

భావప్రకటనా స్వేచ్ఛకు విఘాతం కలిగించారని విమర్సించింది. ఏ మేరకు పిఎఫ్ఎల్ ప్రతినిధి వినోద్ బండా ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రజల సమస్యలపై లోకసత్తా పోరాటం చేస్తోందని, గోదావరి జలాల దుర్వినియోగం, హైదరాబాదుకు కృష్ణా జలాలు వంటి పలు సమస్యలపై లోకసత్తా ఉద్యమం చేపట్టిందని ఆయన అన్నారు. లోకసత్తా తెలంగాణ ప్రజలకు అవకాశాలు లభించే విధంగా పనిచేస్తోందని ఆయన చెప్పారు.

లోకసత్తా ఒక సీటుకే పరిమితమైనా ప్రజాస్వామిక విలువలకు కట్టుబడడంలో ముందుందని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఉంటుందని, అయితే వాస్తవాలను వక్రీకరించకూడదని ఆయన అన్నారు. భయపెట్టి, బలప్రయోగం చేసి వాస్తవాలను మరుగు పరచలేరని వ్యాఖ్యానించారు. జెపిపై జరిగిన దాడికి నిరసనగా అమెరికాలోని బే ఏరియా, హూస్టన్, డల్లాస్ వంటి ప్రాంతాల్లో గురువారం బ్లాక్ డేగా పరిగణిస్తూ ఎన్నారైలు సమావేశాలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+