వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గల్ఫ్‌లో తెలంగాణవారికి సీమాంధ్రుల సాయం: పట్టని నేతలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

United Andhra
ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగుస్తున్న ప్రస్తుత సమయంలో సీమాంధ్రకు చెందిన ఓ వ్యక్తి మానవత్వం వేరు, ప్రాంతీయ తత్వం వేరు అని నిరూపించాడు. ఇరు ప్రాంతాలలోని ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నది రాజకీయ నాయకులకే కానీ మానవత్వంతో కూడిన తమలో లేవని నిరూపించాడు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెందిన బొమ్మకాండ స్వామి గౌడ్ అనే వ్యక్తి ఇటీవల సౌదీ అరేబియాలోని హౌతా అనే ఏడారి ప్రాంతంలో గుండె జబ్బుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే స్వామి మృతదేహాన్ని నిజామాబాదు జిల్లాలోని ఆయన స్వగ్రామం పంపించడానికి ఎవరూ ముందుకు రాలేదు. తెలంగాణ కోసం పోరాటం చేస్తాం, తెలంగాణ ప్రజల అస్తిత్వమే ముఖ్యమని చెప్పే తెలంగాణ వాద రాజకీయ పార్టీలు కూడా ముందుకు రాలేదు. స్వామి గౌడ్ తన వద్ద పని చేయడం లేదని చెప్పి అరబ్బు యజమాని చేతులెత్తేశాడు. స్పాన్సర్ లేని మృతదేహాల ఖర్చులు మాత్రమే భరించే భారతీయ ఎంబసీ దానిపై నోరు మెదపలేదు.

తెలంగాణ వాదాన్ని నెత్తిన పెట్టుకొని నిత్యం ప్రచార సాధనాలలో ఊదరగొట్టే ఓ స్థానిక ఎంపీ సైతం హామీనిచ్చినప్పటికీ అది నెరవేరలేదని తెలుస్తోంది. కానీ ప్రాంతీయ తత్వాలను పక్కన పెట్టి చిత్తూరు జిల్లాకు చెందిన సలీం మాత్రం నడుం బిగించాడు. ఆయన కూడా గల్ఫ్‌లో పెద్ద డబ్బున్న వాడు కాదు. మామూలు సైకిల్ దుకాణం నడుపుకుంటూ అక్కడ జీవనం సాగిస్తున్నాడు. ఆయనది చిత్తూరు జిల్లా. అలాంటి సాధారణ వ్యక్తి ప్రాంతీయ భావాలను పక్కన పెట్టి మానవత్వాన్ని తన మదిలో నింపుకొని వారం రోజుల పాటు అక్కడ ఉండే భారతీయులను కలిసి పరిస్థితి వివరించి డబ్బులు సేకరించి స్వామి మృతదేహం సొంత రాష్ట్రానికి రావడానికి సహాయపడ్డాడు. ఇదొక్కటే ఉదాహరణ కాదు. గతంలో తెరాస పార్టీ శాసనసభ్యుడు కల్వకుంట్ల తారక రామారావు నియోజకవర్గానికి చెందిన రాజయ్య అనే వ్యక్తి ఓమన్‌లో మరణించగా తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నల్లూరి హరిబాబు మస్కట్‌కు తీసుకు వచ్చి హైదరాబాద్ పంపించి మానవత్వం కలిగిన తమకు ప్రాంతీయ విభేదాలు లేవని చెప్పకనే చెప్పారు.

English summary
Saleem, who helped to sent Swamy Goud's dead body to Andhra Pradesh was proved humanity without regional feelings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X