లోకసత్తా ఎన్నికల్లో ఎన్నారైలు

2014లో జరిగే ఎన్నికలను దృష్టిలో పె్టటుకుని లోకసత్తా అంతర్గత ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని, గత నెలలో రాష్ట్రవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించింది. బే ఏరియా, చికాగో, హౌస్టన్, న్యూజెర్సీ, వాషింగ్టన్, ఇతర ప్రాంతాలకు చెందిన ఎన్నారైలు సభ్యత్వాన్ని నమోదు కార్యక్రమంలో పాలు పంచుకున్నారు. విజయవంతమైన ఎన్నారైలు హైమా సాగి, దిలీప్ శంకర్ రెడ్డి, పద్మా భూపతిరాజులు ప్రశంసలు అందుకున్నారు. లోకసత్తా కోసం పనిచేయడానికి వెళ్లి తిరిగి వచ్చారు.
వోటింగులో పెద్ద యెత్తున పాల్గొనాలని ప్రసన్న మేదా సభ్యులను కోరారు. కాంగ్రెసు, తెలుగుదేశం వంటి పార్టీలు కుటుంబ వారసత్వాలకు నిలయంగా మారగా, డాక్టర్ జయప్రకాశ్ నారాయణ అందుకు భిన్నంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు. లోకసత్తా ప్రత్యేకంగా ఎన్నారై జిల్లా ఎలక్టోరల్ కాలేజీని ఏర్పాటు చేసింది. దాంతో రాష్ట్ర ఆఫీస్ బియరర్లను, అధ్యక్షుడిని ఎన్నుకుంటుంది.
రాఘవ సోలిపురం అర్హతా విధానానని వివరించారు. ఎన్నారైలు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. న్యూజెర్సీకి చందిన సురేష్ ఈడిగ పిఎఫ్ఎల్ ప్రచారానికి ఇతోధిక బలాన్ని అందించారు. యాభై మందిని లోకసత్తా క్రియాశీలక సభ్యులుగా చేర్పించారు.












Click it and Unblock the Notifications