హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అమెరికాలో తప్పించుకుంటున్న టెక్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Hyderabad
కట్నం వేధింపు కేసులో రాష్ట్రానికి చెందిన ఓ టెక్కీ అమెరికాలో స్టేట్స్ మారుస్తూ పోలీసులకు చిక్కకుండా జాగ్రత్త పడుతున్నాడు. అమెరికాలో ఉన్న ఆ టెక్కీని అరెస్టు చేసి మార్చి 13వ తేదీలోగా తమ ముందు హాజరు పరచాలని హైదరాబాదులోని స్థానిక కోర్టు కుషాయిగుడా పోలీసులను ఆదేశించింది. సురేష్ కుమార్ అకానా అనే ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌పై 2008 నవంబర్ 28వ తేదీ నుంచి నాన్ బెయిలబుల్ అరెస్టు వారంట్ పెండింగులో ఉంది.

పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరుకు చెందిన సురేష్ కుమార్ 2005లో పూర్ణిమ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత కొన్నెళ్లకు వారిద్దరు కలిసి అమెరికా వెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం - కొన్నాళ్లకు అతను ఆమెను వేధించడం ప్రారంభించాడు. ఎంసిఎ గ్రాడ్యుయేట్ అయిన పూర్ణిమ అతనిపై కేసు పెడతానని బెదిరించింది. దానికి భయపడి ఆమెను బుజ్జగించి ఇండియాకు తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత 2007 డిసెంబర్‌లో ఆమెను వదిలేసి అమెరికాకు పారిపోయాడు. ఆమె ఒరిజినల్ సర్టిఫికెట్లు, క్రెడిట్, డెబిట్ కార్డులను కూడా వెంట తీసుకుని వెళ్లాడు.

పెళ్లి సమయంలో తాము 15 లక్షల రూపాయలు ఇచ్చామని, మరిన్ని డబ్బుల కోసం తమ కూతురును సురేష్ కుమార్ వేధిస్తూ వచ్చాడని ఆమె తల్లిదండ్రులకు ఫిర్యాదు చేశారు. సత్యం కంప్యూటర్స్‌లో పనిచేస్తున్న సమయంలో తాను సంపాదించిన 28 వేల డాలర్లను కూడా సురేష్ కుమార్ డ్రా చేసుకున్నాడని చెప్పి పూర్ణిమ బోస్టన్ కోర్టులో కేసు వేసింది.

English summary
A local court directed the Kushaiguda police to produce a 37-year-old software engineer from the United States before it on March 13 in connection with a dowry harassment case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X