లక్ష్మీపార్వతికి అమెరికాలో విందు
అమెరికాలోని సెయింట్ లూయిస్‌లోని పమ్మి సుబ్బారెడ్డి నివాసంలో అన్న వైయస్సార్ అభిమానులు, వైయస్సార్ కాంగ్రెసు సభ్యులు ఇచ్చిన విందుకు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు లక్ష్మీపార్వతి హాజరయ్యారు. అంతకు ముందు ఆదివారం సాయంత్రం ఆమెను వైయస్సార్ యువసేన కార్యకర్తలు లాంబర్ట్ సెయిట్ లూయిస్ అంతర్జాతీయ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.

విందు సమావేశంలో లక్ష్మీపార్వతి మాట్లాడారు. ఇటీవల ఉప ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల కళ్లు తెరిపించాయని ఆమె అన్నారు. సాధారణ ఎన్నికల్లోనూ ఈ ఫలితాలే పునరావృతమవుతాయని ఆమె అన్నారు. సిగ్గంటూ ఉంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాలని ఆమె అన్నారు. 2009 ఎన్నికల తర్వాత జరిగిన 60 సీట్లకు జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందని, చాలా సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోయిందని ఆమె అన్నారు.
చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్నంత కాలం ఆ పార్టీకి భవిష్యత్తు ఉండదని, భవిష్యత్తులో ఏ ఎన్నికల్లోనూ పార్టీ విజయం సాధించబోదని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పట్ల ఉన్న ప్రజాదరణను, ఆయన నిబద్ధతను లక్ష్మీపార్వతి ప్రశంసించారు.
జగన్‌కు సహజంగానే నాయకత్వ లక్షణాలు అబ్బాయని, తాను వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి తన మద్దతును కొనసాగిస్తానని, 2014లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ఆమె అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తరఫున ప్రచారం సాగించి, పార్టీ బలోపేతానికి కృషి చేసినందుకు పమ్మి సబ్బారెడ్డి లక్ష్మీపార్వతికి కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే జగన్ జైలు నుంచి బయటకు వస్తారని, తర్వాతి ముఖ్యమంత్రి జగనేనని ఆయన అన్నారు.
ఈ సమావేశానికి గోపాల్ రెడ్డి టి, సుమ, దినేష్ బత్తుల, రోహిణి, సునేష్ కుటుంబ సభ్యులు, సహస్ర, సాయి, నళిని, రాజశేఖర రెడ్డి, శ్రీకాంత్ వాసేపల్లి, నవీన, శ్రీనివాస రెడ్డి, దీప్తి, నారాయణ, రవి ఉప్పలపాటి, రచన హాజరయ్యారు.












Click it and Unblock the Notifications