23న కువైట్‌లో వైయస్సార్సీ ఎన్నారైల మీట్

YSR Congress
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన కువైట్‌లోని ఖదసియా స్టేడియంలో గల్ఫ్ ప్రవాసాంధ్ర ప్రస్థానం మహాసభ జరుగుతుంది. వైయస్సార్సీ ఎన్నారై విభాగం కువైట్ కమిటీ కన్వీనర్ మేడపాటి వెంకట్ ఈ విషయం చెప్పారు. ఇలియాస్ బిహెచ్ ఈ మహాసభకు సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నారు.

ఈ మహాసభకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు జూపూడి ప్రభాకరరావు, మాజీ శాసనసభ్యులు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, కె. శ్రీనివాసులు, గడికోట శ్రీకాంత్ రెడ్డి, రఘురామిరెడ్డి, అంబటి రాంబాబు, రెహ్మాన్, సురేష్ బాబు, రాజ్ ఠాగూర్, రామ్మోహన్ హాజరవుతారు. వీరంతా ఈ నెల 22వ తేదీన కువైట్‌కు ప్రయాణం అవుతున్నారు. గల్ఫ్ ప్రవాసాంధ్రుల సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభను ఓ వేదికగా వాడుకుంటామని, భవిష్యత్తులో మరిన్ని దేశాల్లో ఇటువంటి సదస్సులు నిర్వహిస్తామని వెంకట్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+