వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సవిత మృతి: నిర్లక్ష్యమే కారణం

By Srinivas
|
Google Oneindia TeluguNews

doctors failed to treat Savita, leaked death probe report says
లండన్: అబార్షన్ చేయకపోవడంతో ఐర్లాండులో మృతి చెందిన భారతీయ వైద్యురాలు సవిత హలప్పన్ సకాలంలో వైద్యం అందకపోవడం వల్లనే మరణించినట్లుగా తెలుస్తోంది. కేసు దర్యాఫ్తుకు సంబంధించిన నివేదిక బహిర్గతమైంది. ఆసుపత్రి సిబ్బంది వైఫల్యం కారణంగానే సవిత మృతి చెందినట్లుగా తెలుస్తోంది. ఆమెకు వైద్యులు సకాలంలో చికిత్స అందించలేదని తెలుస్తోంది. సరైన సమయంలో చికిత్స అందితే ఆమె మృతిని నివారించి ఉండేవారని నివేదిక చెబుతోంది.

విపరీతమైన వెన్ను నొప్పితో గత ఏడాది అక్టోబరు 21న సవిత ఆసుపత్రిలో చేరినప్పుడే గర్భస్రావం లక్షణాలు కనిపించాయని, ఆమె పదే పదే అభ్యర్థించినప్పటికీ సిబ్బంది ఆ దిశగా స్పందించలేదని దీంతో ఆమె మృతి చెందిందని నివేదిక సారాంశంగా తెలుస్తోంది. ఆమె పరిస్థితి తెలిసి ఆమె అడగకముందే వైద్యులు గర్భస్రావం చేయాల్సి ఉండెనని నివేదిక పేర్కొంది. నివేదిక విషయాలతో తాము అవాక్కయ్యామని సవిత భర్త ప్రవీణ్ చెప్పారు.

కాగా అబార్షన్‌కు వైద్యులు నిరాకరించడంతో ఐర్లాండులో భారతదేశానికి చెందిన సవిత హలప్పన్ మృత్యువాత పడిన విషయం తెలిసిందే. రక్తం విషం ఎక్కి ఆమె మరణించింది. కాథలిక్ దేశం కాబట్టి తాము అబార్షన్ చేయబోమని వైద్యులు చెప్పారు. దీంతో ఆమె మరణించింది. మృత్యువాత పడిన 31 ఏళ్ల భారత మహిళ డెంటిస్టు. ఆ మహిళ సవితా మృతిపై ఐరిష్ అధికారవర్గాలు విచారణకు ఆదేశించాయి.

ఆమె 17 వారాల గర్భవతి. ఆమె మిస్ క్యారేజీతో బాధపడుతోంది. సెప్టికేమియాతో కూడా బాధపడుతోంది. గాల్వేలోని బోస్టన్ సైంటిఫిక్ ఇంజనీర్ అయిన ఆమె భర్త ప్రవీణ్ హలపనవార్ - అబార్షన్ చేయాలని మూడు రోజులుగా ఎన్నో సార్లు విజ్ఞప్తి చేశాని చెప్పారు. ఓ రోజు సవిత భరించలేనంత నొప్పితో బాధపడిందని, దాంతో అబార్షన్ కోసం అడిగామని చెప్పారు. గర్భస్థ శిశువు గుండె కొట్టుకుంటోందని, ఇది కాథలిక్ దేశం కాబట్టి మనిషి చంపే అబార్షన్ చేయబోమని వైద్యులు చెప్పారని ఆయన వివరించారు. దీనిపై విచారణకు ఆదేశించడంతో ఇప్పుడు నివేదికలోని అంశాలు బయటపడ్డాయి.

English summary
Indian dentist Savita Halappanavar died as a result of a litany of failures by hospital staff, a leaked draft of a probe report said, proving her family's claim that her death was avoidable.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X