భోజనాలు వండిపెట్టిన ఎన్నారైలు

గత తొమ్మిదేళ్లుగా తెలుగు బడి నడపడం , తెలుగు పండుగల వేడుకలను నిర్వహించడం, వేసవిలో "తెలుగు పిల్లలకు ప్రత్యేక కార్య క్రమాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేస్తోంది. అంతేకాకుండా, తాము నివసిస్తున్న అమెరికా రాజధాని పరిసర ప్రాంతాలలో, పేదవారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సం "వాషింగ్టన్ డిసి కిచెన్‌లో "వారు నిర్వహించే "ఫుడ్ ఫర్ నీడీ " కార్యక్రముం నిర్వహించి ఐదు వేల మందికి భోజనం వండిపెట్టారు.
వనభోజనాలు...
అమెరికా రాజధాని ప్రాంత తెలుగు సంఘంవారు ఆగస్టు 18వ తేదీన ఎల్లికాట్ నగరం, మేరీ ల్యాండ్ రాష్ట్రంలో వన భోజనాల కార్యక్రమాన్ని కన్నులపండుగా జరుపుకున్నారు . క్యాట్స్ ఆధ్యర్యంలో గత మూడు సంవత్సరాలుగా ఈ వన భోజనాలు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు.
క్యాట్స్ ఆధ్వర్యంలో వన భోజనాల కార్యక్రమంతో పాటు స్వాతంత్ర్య దినోత్సవ సంబరాలు కూడా జరిగాయి. పిల్లలు వందేమాతరం, జనగణ పాటలు పాడి అందరిని ఆకట్టుకున్నారు. దాదాపు 400 మంది ఈ కార్యక్రంలో పాల్గొన్నారు. పిల్లలు, పెద్దలు కలసి భోజనాలు చేసి, ఆటల్లో పాల్గొన్నారు. ఆటల పోటీలలో గెలిచినవారికి, బహుమతుల ప్రదానం జరిగింది.
క్యాట్స్ పాలక వర్గ సభ్యులు గోపాల్ నున్న, మధు కోలా , ప్రవీణ్ కాటంగురి, సుదర్శన్ దేవిరెడ్డి, భాస్కర్ బొమ్మారెడ్డి, శ్రీధర్ బాణాల, ప్రసాద్ వేదాటి, అనిల్ రెడ్డి, నల్లమద్ది, గౌడ్ రాంపురం, వెంకట్ గుండా, ప్రవీణ్ యర్రంరెడ్డి, ప్రసాద్ మట్టు పల్లి , ఏవియెన్ రెడ్డి,న సోమేశ్ శర్విరాల, హరీష్, ఉమాకాంత్, శ్రీవాణి దేవిరెడ్డి, సత్యజిత్ మారెడ్డి, బద్రి చల్ల, రామ్మోహన్ బి, క్యాట్స్ స్థాపకులు రామ్మోహన్ కొండా, చిత్తరంజన్ నల్లు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.












Click it and Unblock the Notifications