హత్య కేసులో విముక్తి: పాక్ జైలు నుంచి పరారీ

దుబాయ్‌లోని హోటల్ యజమాని ఎస్.పి.సింగ్ ఒబెరాయ్ వీరికోసం సిక్కుల నుంచి విరాళాల సేకరించడంలో కీలకపాత్ర పోషించారు. దీంతోపాటు పంజాబ్ ప్రభుత్వం చొరవ చూపడంతో వారికి విముక్తి లభించింది. షార్జా నుంచి ఎయిరిండియా విమానంలో వీరంతా ఢిల్లీ చేరుకుని, తక్షణమే అమృతసర్ వెళ్లి స్వర్ణ దేవాలయంలో ప్రార్థనలు చేశారు.
సారా అమ్మకం వివాదం సందర్భంగా పాకిస్థాన్‌కు చెందిన మిస్రీ నజీర్ ఖాన్ వీరి చేతిలో మరణించాడు. దీంతో అక్కడి పోలీసులు కేసు నమోదు చేయగా, 2010 మార్చి 28న మరణ శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. భారత ప్రభుత్వం వారి తరఫున వాదించేందుకు ఐదుగురు న్యాయవాదులను నియమించింది. ప్రవాస భారతీయ న్యాయవాది బిందు వారికి సహకరించారు.
పాక్ జైలు నుంచి భారతీయుడి పరారీ
పాకిస్థాన్ జైలు నుంచి భారత మత్స్యకారుడు తప్పించుకుని పారిపోయాడు. దీనిపై జైలు అధికారులు ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మీడియాకు మంగళవారం అందజేసిన వివరాల మేరకు దక్షిణ పాకిస్థాన్ ప్రాంతం కరాచీ నగరంలోని లాండీ జైలు మెయిన్ గేటు నుంచి కిశోర్ అనే భారత మత్స్యకారుడు సోమవారం తప్పించుకున్నాడు. ఈ ఘటనకు బాధ్యులుగా ఇద్దరు జైలు అధికారులను సస్పెం డ్ చేశామని సింధ్ రాష్ట్ర జైళ్లశాఖ మంత్రి మంజూర్ వాస న్ తెలిపారు. ఖైదీ పరారు ఘటనపై దర్యాప్తు చేయాలని జైలు ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చామన్నారు.












Click it and Unblock the Notifications