తెలంగాణ కోసం గల్ఫ్‌లో ఆత్మహత్య

Telangana
కరీంనగర్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో తెలంగాణ ప్రాంతానికి మాత్రమే పరిమితమైన ఆత్మహత్యలు విదేశాలకు కూడా పాకినట్లు కనిపిస్తున్నాయి. తన మరణం తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తుందని అంటూ గల్ఫ్‌లోని బహ్రెయిన్‌లో కరీంనగర్ జిల్లా యువకుడు పొన్నాల శ్రవణ్ (24) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేటకు చెందిన పొన్నాల రాజయ్య పదేళ్ల క్రితం గల్ఫ్‌కు వెళ్లాడు. శ్రవణ్ కూడా 2010లో కంపెనీ వీసాపై తండ్రి వద్దకు వెళ్లి ఉద్యోగం చూసుకున్నాడు. అదే ఏడాది అక్టోబర్‌లో రాజయ్య గుండె పోటుతో మృతిచెందాడు. తన తండ్రి శవాన్ని గల్ఫ్ నుంచి స్వగ్రామం మల్లారెడ్డిపేటకు తీసుకు వచ్చాడు.

తండ్రి అంత్యక్రియలు నిర్వహించిన సమయంలో శ్రవణ్ తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతుండడం గుర్తించి దాని పట్ల ఆకర్షితుడయ్యాడు. శ్రవణ్ కూడా ఉద్యమంలో పాల్గొంటూ ఆందోళనలు నిర్వహించారు. కుటుంబ పోషణ కష్టంగా ఉండడంతో శ్రవణ్ 2010 అక్టోబర్‌లో మళ్లీ గల్ఫ్‌కు వెళ్లి పోయాడు.

గత నెల రోజులుగా జరుగుతున్న తెలంగాణ పరిణామాలపై శ్రవణ్ ఆందోళనకు గురయ్యాడని శ్రవణ్ స్నేహితులు వివరించారు. ఆదివారం ఉదయం బహ్రెయిన్‌లో తానుంటున్న గదిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు వారు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+