వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాలిఫోర్నియా స్కూల్లో యోగా

By Pratap
|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: దక్షిణ కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలలో యోగా బోధనకు అమెరికా కోర్టు పచ్చజెండా ఊపింది. కరిక్యులంలో భాగంగా యోగాభ్యాసాన్ని కోర్టు అనుమతించింది. యోగా ద్వారా హిందూ మత విశ్వాసాలను ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు తిరస్కరించింది.

ఎన్సినిటాస్ యూనియ్ స్కూల్ డిస్ట్రిక్స్‌లో బోధిస్తున్న యోగా ఏ మతాన్నీ ప్రోత్సహించడం లేదని సాన్ డీగో సుపీరియర్ కోర్టు న్యాయమూర్తి జాన్ మేయర్ ఉత్తర్వులు జారీ చేశారు. సాన్ డీగోలోని ఎన్నినిటాస్ స్కూల్ డిస్ట్రిక్ట్స్‌లో బోధిస్తున్న అష్టాంగ యోగ మత విశ్వాసాలను ప్రోత్సహిస్తుందని పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు కొంత మంది ఆరోపించారు.

 US court allows teaching yoga in California school

తల్లిదండ్రుల తరఫున నేషనల్ సెంటర్ ఫర్ లా అండ్ పాలిసీ ఆ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఎన్సినాటిస్‌లో 30 నిమిషాల పాటు ఇచ్చే యోగాభ్యాసానికి జోయిస్ ఫౌండేషన్ నిధులు సమకూరుస్తోంది. విద్యార్థులకు యోగా ద్వారా ప్రధానంగా శ్వాస సంబంధమైన వ్యాయామాన్ని ఇస్తున్నారు. విద్యార్థులు చురుగ్గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

దీంతో కేసు ముగిసినట్లు కాదని, ప్రజా విద్యలో యోగ స్థితిపై ఇవే చివరి మాటలు కావని, ఇది ప్రారంభం మాత్రమేనని ఎన్సినిటాస్ పేరెంట్స్ స్టీఫెన్, జెన్నిఫర్ సెడ్లాక్ అంటరాన్ని డీన్ బ్రోయెల్స్ అన్నారు.

English summary

 A US court has allowed teaching yoga in a Southern California district school as part of curriculum, rejecting the petition by parents that the ancient Indian practice is promoting Hindu religious beliefs.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X