డెట్రాయిట్‌లో వైయస్సార్ జయంతి

YSR birth anniversary in Detroit
డెట్రాయిట్: దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డెట్రాయిట్ విభాగం జూలై 8వ తేదీన ఇక్కడ ఘనంగా నిర్వహించింది. పలువురు ఎన్నారైలు జననేతకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డా. వైయస్ రాజశేఖర రెడ్డి వారసత్వానికి సంబందించి ఒక వీడియో ని ప్రదర్శించారు.

లింగాల హరిప్రసాద్ రెడ్డి, వినోద్ కుకునూర్, వెంకట్ బీరం, రమణ రెడ్డి పటేలు, సునీల్ మండుటి, వినోద్ ఆత్మకూరు, ఫురశొథమ్ కూకటి, కొండారెడ్డి తోట్టిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి పిడపర్తి, శివరాం యార్లగడ్డ, యుగంధర్ భుమిరెడ్డి, సాగర్ రెడ్డి, శ్రీనివాస్ బర్ల, లోక రెడ్డి, జోగేశ్వర రావు (డిటిఎ మాజీ అధ్యక్షుడు), వేణు సూరపరాజు (డిటిఎ ప్రెసిడెంట్-ఎలెక్ట్), కోటి రెడ్డి, కరుణాకర్ రెడ్డి, వెంకట్ పాలా తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు. డా. వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవితం యొక్క ప్రాముఖ్యతను, మహానేత ఏవిధంగా కోట్లాదిమంది ప్రజల జీవితాలను తాకారో, ఎలా వారి హృదయాల్లో కొలువై వున్నారో వివరించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మన రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు చేసిన విశిష్టమైన సేవల్ని గుర్తు చేశారు. వైయస్ రాజశేఖర రెడ్డి ప్రసిద్ధ సంక్షేమ పథకాలను గుర్తుచేసుకున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఈ సందర్భంగా మాట్లాడారు. మన రాష్ట్ర సంక్షేమం కోసం జగన్‌కు మద్దతు తెలపాల్సిన అవసరాన్ని వారు వివరించారు. వైయస్ జగన్ 2014 ఎన్నికల్లో సంపూర్ణ మెజారిటీతో ముఖ్యమంత్రిగా గెలిచి వైయస్ రాజశేఖర రెడ్డి మన రాష్ట్రాభివ్రుధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం కన్న కలల్ని నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పంచాయతి ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ విజయానికి తమ వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా వారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+