అమెరికాలో టాంటెక్స్ ‘నెల నెలా తెలుగు వెన్నెల’(పిక్చర్స్)

టెక్సాస్: ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నిర్వహించే "నెల నెలా తెలుగు వెన్నెల" 91 వ కార్యక్రమం ఆదివారం ఫిబ్రవరి 15న ఇర్వింగ్ నగరంలోని దేశి ప్లాజా స్టూడియో‌లో సాహిత్య వేదిక మన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఇటీవల అకస్మాత్తుగా పరమపదించిన డాలస్ వాసులు పూసర్ల ఉషారాణి ఆత్మకు శాంతి చేకూరాలని సభ నిమిషంపాటు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు.

టెక్సాస్ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా "నెల నెలా తెలుగు వెన్నల" కార్యక్రమం ఆన్‌లైన్ ద్వారా దేశి ప్లాజా (డిపి టీవి) వారి సహకారంతో ప్రత్యక్ష ప్రసారం కావడంతో ఒక్క డాలస్ నగరంలో మాత్రమే కాకుండా, టెక్సాస్ రాష్ట్రం, ఇంకా ప్రపంచ నలుమూలల నుండి విశేష సంఖ్యలో తెలుగు ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చూడడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.

సాంప్రదాయ బద్ధమైన ప్రార్ధన గీతం "చిన్నారి పాపాయి"తో డాలస్ చిన్నారులు బిల్లా శ్రేయ, తెలకలపల్లి శ్రియ , సుంకిరెడ్డి అవని, వడ్లమన్నాటి శ్వేత, తోటకూర ప్రీతిక్, వాసకర్ల శ్రియ గానం చేయడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం అంపశయ్య నవీన్ రచించిన ‘అంపశయ్య' అనే పుస్తకము గురించి బసాబత్తిన శ్రీనివాసులు వివరించారు. వేల సంవత్సరాల క్రితం సంస్కృతంలో భరతముని రచించిన "నాట్యశాస్త్రం" పుస్తకాన్ని పోనంగి శ్రీరామ అప్పారావు తెనిగించిన విషయాలను, అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రు చేతుల మీదుగా వారు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకొనడం గురించి కలవగుంట సుధ ఆహుతులకు వివరించారు.

ఆ తర్వాత సాహిత్య వేదిక బృంద సభ్యురాలు సింగిరెడ్డి శారద ఒక చక్కటి స్వీయ కవితను చదివి వినిపించారు. దొంతి శోభారాణి ‘నిగమ నిగమాంత వర్ణిత'అనే ఒక అన్నమాచార్య కీర్తన పాడి ఆహ్వానితులకు వినిపించారు. వచన కవిత్వం గురించి ప్రస్తావిస్తూ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచించిన "అమృతం కురిసిన రాత్రి', మహాకవి శ్రీ శ్రీ మహాప్రస్థానం నుండి కొన్ని ప్రముఖ పద్యాలను జలసూత్రం చంద్రశేఖర్ తన చక్కటి వాక్చాతుర్యం ప్రదర్శిస్తూ చదివి ఆహ్వానితులను ఆకట్టుకున్నారు.

పూర్ణ నెహ్రు ఈనాటి ముఖ్య అతిథి ప్రభల శ్రీనివాస్ సంగీతం, సాహిత్యం, నాటక రంగాలలో వున్న ప్రతిభను తెలుపుతూ.. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి పరిచయం చేస్తూ వేదికపైకి ఆహ్వానించారు. జుజారే రాజేశ్వరి పుష్పగుచ్చంతో ప్రసంగకర్తకు స్వాగతం పలికారు. సంగీతానికి సాహిత్యానికి విడదీయలేని సంబంధం ఉందనేది జగమెరిగిన సత్యం, అయితే సాహిత్యం వెంట సంగీతం పరుగిడుతుందా? లేక సంగీతపు నది మలుపుల్లో సాహిత్యం సేద తీరుతుందా? అనే విషయం కూలంకషంగా చర్చించి ఆహుతులచేత జయ జయ ధ్వానాలు అందుకొన్నారు ప్రభల శ్రీనివాస్.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం నిర్వహించే "నెల నెలా తెలుగు వెన్నెల" 91 వ కార్యక్రమం ఆదివారం ఫిబ్రవరి 15న ఇర్వింగ్ నగరంలోని దేశి ప్లాజా స్టూడియో‌లో సాహిత్య వేదిక మన్వయకర్త దండ వెంకట్ అధ్యక్షతన ఘనంగా జరిగింది.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

ఈ సందర్భంగా ఇటీవల అకస్మాత్తుగా పరమపదించిన డాలస్ వాసులు పూసర్ల ఉషారాణి ఆత్మకు శాంతి చేకూరాలని సభ నిమిషంపాటు మౌనం పాటించి శ్రద్దాంజలి ఘటించారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

టెక్సాస్ రాష్ట్రంలో మొట్ట మొదటి సారిగా "నెల నెలా తెలుగు వెన్నల" కార్యక్రమంఆన్‌లైన్ ద్వారా దేశి ప్లాజా (డిపి టీవి) వారి సహకారంతో ప్రత్యక్ష ప్రసారం కావడంతో ఒక్క డాలస్ నగరంలో మాత్రమే కాకుండా, టెక్సాస్ రాష్ట్రం, ఇంకా ప్రపంచ నలుమూలల నుండి విశేష సంఖ్యలో తెలుగు ప్రేక్షకులు ఈ కార్యక్రమాన్ని చూడడం జరిగిందని నిర్వాహకులు తెలిపారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

సాంప్రదాయ బద్ధమైన ప్రార్ధన గీతం "చిన్నారి పాపాయి"తో డాలస్ చిన్నారులు బిల్లా శ్రేయ, తెలకలపల్లిశ్రియ, సుంకిరెడ్డి అవని, వడ్లమన్నాటి శ్వేత, తోటకూర ప్రీతిక్, వాసకర్ల శ్రియ గానం చేయడంతో కార్యక్రమం ప్రారంభమైంది.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

అనంతరం అంపశయ్య నవీన్ రచించిన ‘అంపశయ్య' అనే పుస్తకము గురించిబసాబత్తిన శ్రీనివాసులు వివరించారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

వేల సంవత్సరాల క్రితం సంస్కృతంలో భరతముని రచించిన "నాట్యశాస్త్రం" పుస్తకాన్ని పోనంగి శ్రీరామ అప్పారావు తెనిగించిన విషయాలను, అప్పటి భారత ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రుచేతుల మీదుగా వారు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు అందుకొనడం గురించి కలవగుంట సుధ ఆహుతులకు వివరించారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

ఆ తర్వాత సాహిత్య వేదిక బృంద సభ్యురాలు సింగిరెడ్డి శారద ఒక చక్కటి స్వీయ కవితను చదివి వినిపించారు. దొంతి శోభారాణి ‘నిగమ నిగమాంత వర్ణిత'అనే ఒక అన్నమాచార్య కీర్తన పాడి ఆహ్వానితులకు వినిపించారు.

నెల నెలా వెన్నెల

నెల నెలా వెన్నెల

వచన కవిత్వం గురించి ప్రస్తావిస్తూ దేవరకొండ బాలగంగాధర్ తిలక్ రచించిన "అమృతం కురిసిన రాత్రి', మహాకవి శ్రీ శ్రీ మహాప్రస్థానం నుండి కొన్ని ప్రముఖ పద్యాలను జలసూత్రం చంద్రశేఖర్ తన చక్కటి వాక్చాతుర్యం ప్రదర్శిస్తూ చదివి ఆహ్వానితులను ఆకట్టుకున్నారు.

శ్రీ ప్రభల శ్రీనివాస్ తమకే సొంతమైన అద్భుత గాత్రంతో, త్యాగరాజు- అన్నమయ్యలే దిగివచ్చారా అన్నంత రీతిలో కీర్తనలు గానం చేశారు. మొదటగా పొన్నై పిళ్ళై రాసిన ‘రంగ నాథుడే , అంతా రంగ నాథుడే , అంత రంగ నాథుడే' అనే కీర్తనతో కార్యక్రమం ప్రారంభించారు.

త్యాగరాజు గారి గురించి మాట్లాడక పోతే శాస్త్రీయ సంగీతం గురించి మాట్లాడడం అసంపూర్తిగా ఉంటుందని, ఆయన చేయని ప్రయోగం లేదని, కొన్ని లక్షల శిష్య కోటిని తయారు చేశారని చెప్పారు. ఆయన రచించిన ‘గంధము పుయ్యరుగా 'అనే పాటను ఆహుతులందరి చేతా పాడించారు. ఈ రోజుల్లో కూడా స్వరాల మీద, కొత్త కొత్త రాగల మీద ప్రయోగాలు చేసిన గొప్ప సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాల మురళి కృష్ణ గురించి ప్రస్తావించారు.

టాంటెక్స్ అధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి, ఉత్తరాధ్యక్షులు జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం సంయుక్తంగా ముఖ్య అతిధి ప్రభల శ్రీనివాస్‌ని దుశ్శాలువతో, సమన్వయ కర్త దండ వెంకట్, సాహిత్య వేదిక బృందం జ్ఞాపికతో సత్కరించారు. సంస్థ ఉపాధ్యక్షులు ఉప్పలపాటి కృష్ణా రెడ్డి , సoయుక్త కార్యదర్శి వీర్నపు చినసత్యం ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+