NRI news: సినీ నటి స్వాతిదీక్షిత్ కేసు నమోదు చేసిన పోలీసులు..
బిగ్ బాస్ ఫేమ్, సినీ నటి స్వాతి దీక్షిత్ పై హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమె ఓ ఎన్నారై మహిళ ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన్నట్లు పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్ లో రూ.30 కోట్ల ఇంటి కబ్జా కోసం ప్రయత్నిస్తున్న నిందితుల్లో స్వాతి కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 58, ప్లాట్ నంబరు 1141 యజమానురాలు మాధురి విదేశాల్లో ఉంటున్నారు. ఆమె తన ఇంటిని విక్రయించాలని భావించారు. దీంతో తెలసిన వారితో తన ఇంటిని అమ్ముతున్నట్లు చెప్పారు.
ఎవరైనా కొనేవారు ఉంటే చెప్పాలని కోరారు. అయితే స్వాతి దీక్షిత్ ఆ ఇంటిని కొనుగోలు చేయాలని చూశారు. ఇంటి విక్రయం వ్యవహారంలో స్వాతి దీక్షిత్ ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా ఉన్నారు. డబ్బుల విషయంలో ఇరువర్గాల మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఇల్లు లావాదేవీలపై కోర్టుకు వెళ్లారు. ప్రస్తుతం కోర్టులో కేసు నడుస్తుండగా.. స్వాతి దీక్షిత్ సోమవారం ఆ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశారు. ఆమె తన కారుతో ఇంటి గేటును బలంగా ఢీకొట్టి ధ్వంసం చేశారు. స్వాతి దీక్షితో పాటు 20 మంది ఇంట్లోకి ప్రవేశించినట్లు తెలిసింది.

ఈ క్రమంలో వారు ఇంట్లో పని చేసే శోభ ఆమె భర్త అశోక్ తిట్టారు. ఇల్లు ఖాళీ చేసి వెళ్లాలని బెదిరించారు. లేకుంటే చంపుతామంటూ హెచ్చారు. వాచ్ మెన్ వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు నిందితులు స్వాతి దీక్షిత్, చింతల సాయి ప్రశాంత్, రణవీర్ సింగ్, రామ్‌కుమార్‌తో పాటు మిగిలిన వారిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 147, 148, 447, 427, 504, 506 red with.147 కిం కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.
స్వాతి దీక్షిత్ ఏం పిల్లా ఏం పిల్లడో, బ్రేకప్, జంప్ జిలానీ, లేడిస్ అండ్ జెంటిమెన్, చిత్రంగద, దెయ్యం సినిమాల్లో నటించారు. ఆమె 2020 బిగ్ బాస్ సీజన్ 4 కంటిస్టెంట్ గా ఉన్నారు.












Click it and Unblock the Notifications