NRI News: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బెదిరించిన ఎన్నారైపై లూక్ ఔట్ నోటీసు జారీ..!

చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను బెదిరించిన ఓ ఎన్నారైపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానని బెదిరించి 20 లక్షలు డిమాండ్ చేసిన ఎన్నారైపై కరీంనగర్ పోలీసులు లుక్ ఔట్ సర్క్యులర్ (ఎల్‌ఓసి) జారీ చేశారు. ఎమ్మెల్యే తనకు ఫోన్ రాగానే పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ శివారులోని బోడుప్పల్‌కు చెందిన యాస అఖిలేష్ రెడ్డిగా గుర్తించారు. ప్రస్తుతం అతను లండన్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.

సెప్టెంబర్‌లో ఓ గుర్తుతెలియని వ్యక్తి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి నీ రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తామని, ప్రతిష్టను దెబ్బతీస్తానని, తన ఇద్దరు పిల్లలను కూడా అనాథలను చేస్తామని బెదిరించాడు. రూ. 20 లక్షలు ఇవ్వాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేశాడు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.విచారణలో బోడుప్పల్‌లోని భవానీనగర్‌కు చెందిన యాస అఖిలేష్‌రెడ్డి (33) అనే వ్యక్తి కాల్‌ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

A look out notice has been issued against the NRI who threatened MLA Medipalli Satyam

ప్రస్తుతం లండన్‌లో ఉన్న అతడు అక్కడి నుంచి బెదిరింపులకు పాల్పడుతున్నందున నిందితుడిపై ఇమ్మిగ్రేషన్ బ్యూరో ద్వారా ఎల్‌ఓసీ జారీ చేసినట్లు కరీంనగర్ రూరల్ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ వెంకటరమణ వివరించారు. కాగా గురువారం ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా కరీంనగర్ లోని ఇందిరా చౌక్ లో ఇందిరా గాంధీ వర్ధింతి వేడుకలు నిర్వహించారు. మేడిపల్లి సత్యం హైలాండ్ వద్ద ఉన్న ఇందిరా విగ్రహానికి పూల మాల వస్తున్న సమయంలో కింద పడ్డారు. అక్కడ ఏర్పాటు చేసిన గద్దె స్వల్పంగా కూలడంతో సత్యం కింద పడిపోయారు.

నేతలు, కార్యకర్తలు సత్యంను వెంటనే పైకి లేపారు. నాకు ఏమి కాలేదంటూ ఎమ్మెల్యే సత్యం సమాధానం చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సరిగా స్టేజ్ ఏర్పాటు చేయాలిగా అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+