NRI News: ఫిలిప్పీన్స్ లో యాదాద్రి జిల్లా వాసి అనుమానాస్పద మృతి..
తెలంగాణలోని యాదాద్రి జిల్లా వాసి ఫిలిప్పీన్స్ దేశంలో మృతి చెందాడు. 'దవోవ మెడికల్' కాలేజీలో వైద్య విద్యను అభ్యసిస్తున్న గూడూరు మణికాంత్ రెడ్డి అనుమానాస్పదస్థితిలో మరణించాడు. మణికాంత్ రెడ్డి మృతిపై ఫిలిప్పీన్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండలం రామలింగంపల్లి గ్రామానికి చెందిన మణికాంత్ రెడ్డి ఎనిమిది నెలల క్రితం ఫిలిప్పీన్స్ వెళ్లాడు. ఏప్రిల్ 23న తెల్లవారుజామున మణికాంత్ రెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందినట్లు దవోవ మెడికల్ కళాశాల యాజమాన్యం ఫోన్ ద్వారా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కొద్ది రోజుల క్రితం ఇంగ్లాండ్ లో తెలంగాణకు చెందిన యువతి మృతి చెందింది. హైదరాబాద్ కు చెందిన యువతి పై చదువులకు లండన్ వెళ్లి అక్కడే కన్నుమూశారు. యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరుకు చెందిన కొమ్మారెడ్డి శశిధర్ రెడ్డి, జ్యోతి దంపతులు హైదరాబాద్ వచ్చిఐఎస్‌సదన్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్నారు. వీరికి కూతరు తేజస్వి ఉన్నారు. ఆమె హైదరాబాద్ లోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో సీఎస్ఈ బిటెక్ పూర్తి చేశారు.

పై చదువుల కోసం లండన్ లోని క్రాన్ ఫీల్డ్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. గత సంవత్సరం సెప్టెంబర్ లో ఆమె లండన్ వెళ్లారు. అయితే ఏప్రిల్ 11న ఆమె తన స్నేహితులతో కలిసి బ్రైటని బీచ్ కు వెళ్లారు. అక్కడ ఫ్రెడ్స్ కలిసి ఎంజాయ్ చేశారు. నీటిలోకి తిగడంతో భారీ అలలకు సముద్రంలోకి కొట్టుకెళ్లారు. వెంటనే అలర్ట్ అయిన స్నేహితులు ఎమర్జెన్సీ రెస్పాన్స్ బృందానికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడి చేరుకున్న ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం తేజస్వి కోసం గాలింపు చేపట్టారు.
కొన్ని గంటల తర్వాత సముద్రంలో తేజస్వి మృతదేహాన్ని గుర్తించిన ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం మృతదేహాన్ని ససెక్స్ కౌంటీ ఆస్పత్రికి తరలించారు. తేజస్వి స్నేహితులు ఆమె చనిపోయిన విషయాన్ని హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు తెలిపారు. తేజస్వి చనిపోవడానికి ముందు తన తల్లిదండ్రులతో వీడియోకాల్‌లో మాట్లాడినట్లు బంధువులు తెలిపారు. ఆరేడు నెలల్లో గ్రాడ్యుయేషన్ కూడా ఉండటంతోసెర్మనీకి వెళ్లడానికి తల్లిదండ్రులు ఏర్పాట్లు చేసుకున్నారని తెలిపారు.













Click it and Unblock the Notifications