NRI: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు విద్యార్థిని మృతి..
ఇండియా నుంచి చాలా మంది పై చదవుల కోసం అమెరికా వెళ్తుంటారు. తాజాగా పై చదువుల కోసం అమెరికా వెళ్లిన ఓ తెలుగు యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ సమీపంలోని ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ విజయవాడలో ఓ వైద్య కళాశాలలో ఫిజియోథెరపీ చేశారు. ఎంఎస్ చేయడానికి ఈ సంవత్సరం ఆగస్ట్ లో అమెరికాలోని షికాగో వెళ్లారు.
షేక్ జహీరా నాజ్ బుధవారం కారులో బయటకు వెళ్తున్నారు. ఆమె కారులో ప్రయాణిస్తున్న క్రమంలో గ్యాస్ లీకయింది. దీంతో డ్రైవర్ తో పాటు ఆమె కూడా స్పృహ తప్పి చనిపోయారు. దీంతో కారు డివైడర్ ను ఢీకొని ఆగిపోయింది. గమనించిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే షేక్ జహీరా నాజ్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు.

అయితే షేక్ జహీరా నాజ్ మృతికి సంబంధించి వైద్య నివేదిక రావాల్సి ఉంది. ఆమె చనిపోయిన విషయాన్ని ఇండియాలోని తల్లిదండ్రులకు తెలిపారు. గత సెప్టెంబర్ లో ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల విద్యార్థిని జాహ్నవి కూడా రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నార్త్‌ఈస్ట్రన్ యూనివర్శిటీ సీటెల్ క్యాంపస్‌లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో ఎంఎస్ చదువుతున్న జాహ్నవి జనవరి 5న క్యాంపస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా పోలీసు కారు ఆమెను ఢీకొనడంతో మృతి చెందింది.












Click it and Unblock the Notifications