NRI News: విమానంలో కూర్చున్న సీటులో కుప్పకూలిపోయిన యువతి..

విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లింది. సక్సెస్ ఫుల్ గా కోర్సు పూర్తి చేసింది. నాలుగేళ్ల తర్వాత తల్లిదండ్రులను చూడాలనుకుంది. వెంటనే ఆన్ లైన్ విమాన టికెట్ బుక్ చేసింది. విమానాశ్రయానికి వచ్చి విమానం ఎక్కింది. విమానం టేకాఫ్ అవ్వడానికి ముందు ఆ యువతి కూర్చున్న సీట్లోనే కుప్పకూలిపోయింది. దీంతో విమానంలో ఉన్నవారంతా ఒక్కసారిగా షాక్ గురయ్యారు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ ఎయిర్ పోర్టులో జరిగింది.

భారత్ కు చెందిన 24 ఏళ్ల మన్ ప్రీత్ కౌర్ పై చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లింది. కౌర్ 2020లో చెఫ్ అవ్వాలన్న లక్ష్యంతో ఆస్ట్రేలియా వెళ్లింది. నాగేళ్లు కష్టపడి చదివింది. కుకింగ్ కోర్సు పూర్తి చేసింది. అక్కడే పార్ట్ టైం ఉద్యోగం చేస్తోంది. ఈ క్రమంలో తల్లిదండ్రులను చూడాలనుకుంది. టికెట్ బుక్ చేసుకుని మెల్ బోర్న్ ఎయిర్ పోర్టుకు వచ్చి విమానం ఎక్కింది. సీట్ బెల్ట్ పెట్టుకుంటూ కౌర్ కుప్పకూలిపోయింది. విమానం సిబ్బంది వెంటనే స్పందించి అత్యవసర వైద్యం అందించినా ఫలితం లేకపోయింది.

A young woman from India died in the seat of the plane in Australia

కౌర్ చనిపోయింది. మన్ ప్రీత్ కౌర్ టీబీతో చనిపోయినట్లు ఆస్ట్రేలియా వైద్యులు తెలిపారు. టీబీతో కౌర్ ఊపిరితిత్తులు దెబ్బతిని మరణించినట్లు పేర్కొన్నారు. కౌర్ భారత్ కు వచ్చే ముందు తన స్నేహితులతో కలిసి విక్టోరియా వెళ్లినట్లు తెలిసింది. కౌర్ మరణం తర్వాత తన ఫ్రెండ్స్ అంత కలిసి గో ఫండ్ మీ అనే పేజీ క్రియేట్ చేసి సహాయం చేశారు. మన్ ప్రీత్ కౌర్ మృతదేహాన్ని త్వరలోనే ఇండియాకు తీసుకురానున్నారు.

మరో ఘటనలో ఖమ్మం జిల్లాకు చెందిన విద్యార్థి కిరణ్ అమెరికాలో మరణించాడు. ఈత రాకున్నా స్విమ్మింగ్ పుల్ లో దిగడంతో కిరణ్ మరణించినట్లు చెబుతున్నారు. గత ఏడాది నవంబర్ లో కిరణ్ పై చదువుల కోసం అమెరికా వెళ్లాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+