న్యూయార్క్‌లో ఉగాది ఉత్సవాలు

న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఆల్బని తెలుగు సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఏప్రిల్ 5న ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తానా చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

ఉగాది ఉత్సవాలలో భాగంగా ఆల్బని తెలుగు అసోసియేషన్ సభ్యులు, చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అలరించాయి. ఆటా ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన ప్రముఖ సినీ గాయని కౌసల్య, వర్ధమాన గాయకుడు పృథ్వీచంద్ర తమ పాటలతో ఆకట్టుకున్నారు.

సినీ నటుడు, మిమిక్రి కళాకారుడు శివారెడ్డి తన ప్రదర్శనతో తెలుగు ప్రజలను కడుపుబ్బ నవ్వించారు. ముఖ్యంగా ఆయన ఆడవేషంతో ప్రదర్శించిన లఘు నాటిక ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఉగాది సందర్భంగా అందరికీ ఉగాది పచ్చడిని అందజేశారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

Albany Telugu Association celebrates Ugadi Uthsavalu

కార్యక్రమ ప్రత్యేక ఆహ్వానితులను ఆటా అధ్యక్షుడు నాదెళ్ల శ్రీనివాస్ శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలతో సత్కరించారు. సుమారు వెయ్యి మందికి పైగా తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల్బని తెలుగు అసోసియేషన్ కార్యదర్శి పూర్ణ ఇలిపిల.. కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.న్యూయార్క్: అమెరికాలోని న్యూయార్క్‌లో ఆల్బని తెలుగు సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది ఉత్సవాలు ఏప్రిల్ 5న ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు తానా అధ్యక్షుడు నన్నపనేని మోహన్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తానా చేస్తున్న పలు సేవా కార్యక్రమాల గురించి వివరించారు.

ఉగాది ఉత్సవాలలో భాగంగా ఆల్బని తెలుగు అసోసియేషన్ సభ్యులు, చిన్నారులు ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అహుతులను అలరించాయి. ఆటా ప్రత్యేక అతిథులుగా విచ్చేసిన ప్రముఖ సినీ గాయని కౌసల్య, వర్ధమాన గాయకుడు పృథ్వీచంద్ర తమ పాటలతో ఆకట్టుకున్నారు.

సినీ నటుడు, మిమిక్రి కళాకారుడు శివారెడ్డి తన ప్రదర్శనతో తెలుగు ప్రజలను కడుపుబ్బ నవ్వించారు. ముఖ్యంగా ఆయన ఆడవేషంతో ప్రదర్శించిన లఘు నాటిక ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. ఉగాది సందర్భంగా అందరికీ ఉగాది పచ్చడిని అందజేశారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు.

కార్యక్రమ ప్రత్యేక ఆహ్వానితులను ఆటా అధ్యక్షుడు నాదెళ్ల శ్రీనివాస్ శాలువాలతో సన్మానించి, జ్ఞాపికలతో సత్కరించారు. సుమారు వెయ్యి మందికి పైగా తెలుగువారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆల్బని తెలుగు అసోసియేషన్ కార్యదర్శి పూర్ణ ఇలిపిల.. కార్యక్రమానికి హాజరై విజయవంతం చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+