Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబును సీఎం చేయడమే లక్ష్యం: ఎన్నికల క్షేత్రంలోకి టీడీపీ ఎన్నారైలు

అమరావతి: గత ఐదేళ్ల పాలనలో అంధకారంలోకి వెళ్లిపోయిన రాష్ట్ర భవిష్యుత్తును తిరిగి గాడిలో పెట్టడానికి నారా చంద్రబాబు నాయుడును తిరిగి సీఎంను చేయడమే లక్ష్యంగా టీడీపీ ఎన్‌ఆర్‌ఐలు నడుం బిగించారు. ఎన్నికల క్షేత్రంలోకి దూకేందుకు ఇప్పటికే దాదాపు 1500 మంది ఎన్‌ఆర్‌ఐలు 125 దేశాల నుంచి తమ స్వస్థలాలకు చేరుకున్నారు. వీరందరూ రానున్న ఎన్నికల్లో ఎలా పనిచేయాలి, ఎన్డీయే అభ్యర్ధుల విజయం కోసం ఎలా కృషి చేయాలి, ఓటర్లను ఎలా ప్రభావితం చేయాలనే అంశాలపై టీడీపీ ఎన్‌ఆర్‌ఐ విభాగం మంగళవారం మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఎన్‌రీచ్‌ ఏపీ మీట్‌ నిర్వహించింది.

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం అధ్యక్షుడు వేమూరి రవికుమార్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గల్ఫ్‌ ప్రాంత కమిటీ అధ్యక్షుడు రవి రాధాకృష్ణ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్సీ టీడీ జనార్థన్‌ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ జగన్‌రెడ్డి ప్రభుత్వాన్ని దించాలని, చంద్రబాబను మళ్లీ ముఖ్యమంత్రిని చేయాలనే దృఢమైన పట్టుదలతో ఉన్నారని అన్నారు.

chandrababu should be cm again TDP NRIs in election campaign

ఎన్‌ఆర్‌ఐలలో కూడా అదే పట్టుదల కనిపిస్తోందని, అందుకే ఏ ఎన్నికల్లోనూ లేని విధంగా నెల రోజుల ముందే దాదాపు 1500 మంది ఎన్‌ఆర్‌ఐలు రాష్ట్రానికి వచ్చి ఎన్డీయే అభ్యర్ధుల విజయం కోసం కృషి చేయడానికి ముందుకు రావడం సామాన్య విషయం కాదన్నారు. రాష్ట్రంలో పరిస్థితులు బ్రిటీష్‌ పాలన కన్నా అన్యాయంగా ఉన్నాయన్నారు. సహజవనరుల లూటీ జరుగుతోందని, ప్రయివేట్‌ ఆస్తులను కూడా రక్షణ లేకుండా పోయిందని, ఈ పరిస్థితిని మార్చాలంటే చంద్రబాబును మళ్లీ సీఎం చేయడం ఒక్కటే మార్గమని అన్నారు.

చంద్రబాబు పాలనా కాలంలో ఎన్‌ఆర్‌ఐల తోపాటు రాష్ట్రంలోని ప్రజలందరి ఆస్తుల విలువ పెరిగిందని, ఈ కానీ జగన్‌రెడ్డి పాలనలో ఆయన స్వంత వ్యాపారాలు తప్ప ప్రజల ఆస్తుల విలువలు తరిగిపోయాయని అన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మరో స్వాతంత్య్ర పోరాటం చేయాల్సి ఉందన్నారు. ఎన్నికల యుద్దంలో గెలవాలంటే ముందుగా ప్రచార యుద్దంలో గెలవాలని, ముఖ్యంగా సోషల్‌ మీడియాలో పార్టీ భావజాలాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలని, ఆ పని ఎన్‌ఆర్‌ఐలు సమర్ధవంతంగా చేయగలరని అన్నారు. భవిష్యుత్‌ కాలంలో ఎన్‌ఆర్‌ఐల ఆస్తులకు రక్షణ కావాలన్నా జగన్‌ను ఓడిరచాల్సిందే అన్నారు.

మీ సంతృప్తి కోసం పని చేయండి: బాపట్ల ఎంపీ అభ్యర్ధి కృష్ణ ప్రసాద్‌

ఎన్నో నైపుణ్యాలు కల్గిన, అనుభవం ఉన్న ఎన్‌ఆర్‌ఐలకు ఎవరి నుంచో ప్రశంసలు అవసరం లేదని, తాము ఎంత మేరకు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేయడం కోసం పని చేశామని స్వంతంగా అంచనా వేసుకుంటే సరిపోతుందని బాపట్ల ఎన్డీయే ఎంపీ అభ్యర్ధి కృష్ణ ప్రసాద్‌ అన్నారు. ఎన్నికలకు తక్కువ కాలం ఉండడంతో ఎన్‌ఆర్‌ఐలు కేంద్రీకరించి పని చేయాలని, ఒక బూత్‌నో, ఒక క్లస్టర్‌నో ఎంచుకొని ఫలితాలు వచ్చేలా కష్టపడాలని సూచించారు.

చంద్రబాబు విజన్‌, కష్టపడే తత్వం కారణంగా హైదరాబాద్‌లో 20 ఏళ్లలో ఎంతో అభివృద్ధి జరిగిందని, ప్రత్యక్షంగా ఐదు లక్షల ఉద్యోగాలు, పరోక్షంగా 25 లక్షల మందికి ఉపాధి లభించిందని చెప్పారు. అదే చంద్రబాబు తిరిగి సిఎం అయితే హైదరాబాద్‌ లాంటి అభివృద్ధిని ఏపీలో పదేళ్లలోనే సాధించవచ్చునని అన్నారు. ఎన్నికల క్షేత్రంలోకి దిగుతున్న ఎన్‌ఆర్‌ఐలు ముఖ్యంగా ప్రజలకు వారి పిల్లల భవిష్యత్‌ కోసం చంద్రబాబు మళ్లీ సిఎం కావడం ఎలా అవసరమో వివరించాలన్నారు.

బీపీఎల్‌ కుటుంబాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: ఎమ్మెల్సీ అశోక్‌ బాబు

ఎన్నికల్లో పనిచేయాలని ఎన్‌ఆర్‌ఐలు ముందుకు రావడం అభినందనీయమని, అయితే ఎన్నికల పనిలో సోషల్‌ ఇంజనీరింగ్‌ చాలా ముఖ్యమని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. పేదరికంలో ఉన్న కటుంబాల(బీపీఎల్‌)పై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. జగన్‌రెడ్డి విధానాల కారణంగా ఈ విభాగంలోని ప్రజలకు కూడా నష్టం జరిగినప్పటికీ తమకు డబ్బులు ఇంటికి వస్తున్నాయి కదా అనే భ్రమల్లో ముఖ్యంగా మహిళలు ఎక్కువగా ఉన్నారని చెప్పారు. ఇటువంటి భ్రమల్లో ఉన్న బీపీఎల్‌ కుటుంబాలను ఎన్‌ఆర్‌ఐలు మార్చగలిగితే పెద్ద విజయం సాధించినట్లేనని అన్నారు. ఎన్‌ఆర్‌ఐలు అన్ని నియోజకవర్గాల్లోకి వెళ్లి ప్రచారం చేస్తామనేది కాకుండా వారు ప్రభావితం చేయగలిగిన వారి స్వస్థలాల్లో పని చేస్తేనే మంచి ఫలితాలు వస్తాయని అశోక్‌ బాబు అన్నారు.

టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుచ్చి రామ్‌ప్రసాద్‌ మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్‌ఆర్‌ఐలు అద్భుతంగా పనిచేసి టీడీపీ అభ్యర్ధుల విజయానికి కృషి చేశారని చెప్పారు. ఒక్క ఓటుతోనే ఎన్నికల ఫలితాలు మారిన ఘటనలు చరిత్రలో ఉన్నాయని, కాబట్టి ఎన్‌ఆర్‌ఐలు ఓటర్లను ప్రభావితం చేయడం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ యూఎస్‌ఏ నేత శేషుబాబు మాట్లాడుతూ.. ఎన్‌ఆర్‌ఐలు గట్టిగా పని చేసి 15 నుంచి 20 నియోజకవర్గాల ఫలితాన్ని ప్రభావితం చేయాలని అన్నారు. ఎన్‌ఆర్‌ఐలు యువతను ఆకట్టుకునే పనిలో కృషి చేయాలని, టీడీపీ అధికారంలోకి వస్తే వారికి ఏవిధంగా మంచి జరగుతుందో వివరించి చెప్పాలని అన్నారు.

ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అమెరికా విభాగం నేత కోమటి జయరామ్‌ మాట్లాడుతూ.. ఒక్కో ఎన్‌ఆర్‌ఐ పది వైసీపీ కుటుంబాలను మార్చగలిగినా పెద్ద ఫలితముంటుందని అన్నారు. ఎన్‌ఆర్‌ఐలంతా ఫోకస్‌డ్‌గా పని చేసి ఒక్కొ నియోజకవర్గంలో వెయ్యి ఓట్లను మార్చగలిగినా చాలన్నారు. ఎన్‌ఆర్‌ఐ టీడీపీ అధ్యక్షుడు వేమూరి రవి కుమార్‌ మాట్లాడుతూ.. ఎన్నికల క్షేత్రంలో ప్రత్యక్షంగా పని చేసేందుకు ముందుకు వచ్చిన ఎన్‌ఆర్‌ఐలకు మూడు అప్షన్లు ఇచ్చినట్లు చెప్పారు. వారి స్వంత నియోజకవర్గంలో పని చేయవచ్చునని లేదా సంప్రదాయంగా టీడీపీ బలహీనంగా ఉన్న రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో అయిన పని చేయవచ్చునని, అదీ కాకుంటే కొన్ని కీలకమైన నియోజకవర్గాల్లో పని చేయవచ్చునని అన్నారు. ఎవరు ఎక్కడ పని చేయదలుచుకుంటే అక్కడ వారికి ఎన్‌ఆర్‌ఐ టీడీపీ విభాగం అన్ని రకాలుగా సహకరిస్తుందని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+