CM Jagan: జీవితంలో ఎదగాలంటే చదువొక్కటే సాధనం.. నాటా సభలకు జగన్ సందేశం..
సీఎం జగన్(Jagan) అమెరికాలోని డాల్లస్ లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలనుద్దేశించి వీడియో సందేశం పంప్పారు. ముఖ్యమంత్రి సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు. 2023 నాటా కన్వెన్షన్‌కు హాజరయిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ శుభాకాంక్షలు తెలిపారు. నాటా కార్యవర్గంతోపాటు శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్‌తో ప్రత్యేకించి అభినందించారు. నాలుగేళ్ల కిందట తాను డాల్లస్ కు వచ్చిన సందర్భంగా ఇంకా గుర్తుతుందని జగన్ చెప్పారు.
తెలుగువారంతా తన మీద చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత తాను ఎప్పటికీ మర్చిపోలేనని జగన్ అన్నారు. వేరే దేశంలో ఉన్నా, ఇంత మంది తెలుగువారు ఒక్కటై.. మన సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటటం ఎంతో గొప్ప విషయమని జగన్ కొనియాడారు. అమెరికాలోని పెద్ద పెద్ద కంపెనీలలో సీఈఓలగానూ, ఐటీ నిపుణులుగానూ, నాసా వంచి సంస్ధల్లో కూడా సైంటిస్టులగానూ, అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో కూడా ఉద్యోగులుగా, అక్కడ బిజినెస్‌మెన్‌గా, మంచి డాక్టర్లుగా రాణిస్తున్న తెలుగు వారిని చూసి గర్విస్తున్నట్లు పేర్కొన్నారు.

చాలా మంది తెలుగు వారి మూలాలు.. మన గ్రామాల్లోనే కాకుండా మన మట్టిలో ఉన్నాయన్నారు. అనేకమంది పేద, మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి వచ్చినా.. అక్కడకి వెళ్లి అంకితభావంతో పని చేస్తూ రాణిస్తున్నారని చెప్పారు. వీరంతా అందరికీ స్ఫుర్తిగా నిలుస్తారని కొనియాడారు.
ఎంత ఎత్తుకు ఎదగాలన్నా.. చదువన్నది ఒక పెద్ద అవసరమైన సాధనమని సీఎం జగన్ స్పష్టం చేశారు. అందుకే రాష్ట్రంలో విద్యారంగంలో తెచ్చిన విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చినట్లు చెప్పారు. గవర్నమెంట్ బడులన్నీ కూడా పూర్తిగా రూపురేఖలు మారుతున్నాయని సీఎం నొక్కి చెప్పారు. నాడు నేడు అనే గొప్ప కార్యక్రమం అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
8వ తరగతిలోకి రాగానే మన ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలకు ట్యాబ్‌లు ఇస్తున్నామని గుర్తు చేశారు. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లను నియమించినట్లు వివరించారు. అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, ఉన్నత విద్యలో అయితే విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ కూడా రాష్ట్రంలో గొప్పగా అమలు చేస్తున్నాని తెలిపారు. ఇవన్నీ చదువుకుంటున్న పిల్లల కోసం విద్యావ్యవస్ధలో తెస్తున్న మార్పులని జగన్ స్పష్టం చేశారు.

ఇంగ్లీషు అన్నది ప్రపంచంలో విజ్ఞానాన్ని మనం నేర్చుకునేందుకు, చదువుకునేందుకు ఉపయోగపడే ఒక గొప్ప మీడియమని చెప్పిన జగన్.. గ్లోబల్ సిటిజన్‌గా మన పిల్లలు ఎదగటానికి ఇంగ్లీష్ ఒక సాధనమని వివరించారు. ఏది కావాలన్నా .. సైన్సెస్‌లో ఏది చదువుకోవాలన్నా, ఆర్ట్స్‌లో ఏది చదువుకోవాలన్నా, ఇంజనీరింగ్‌లో ఏది చదువుకోవాలన్నా... చివరికి పిల్లలు తమకు తాముగా ఏ సబ్జెక్ మీద అయినా అవగాహన పెంచుకోవాలన్నా.. ముందు వారికి ఇంగ్లీష్ మీద పూర్తిస్ధాయిలో పట్టు జగన్ పేర్కొన్నారు.
అందుకే బడుల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications