వైఎస్ కు ఘనంగా నివాళులు అర్పించిన వైసీపీ ఎన్నారై నేతలు

డెట్రాయిట్ : దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వర్దంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 10వ తేదీన ట్రాయ్ లో వర్దంతి సభ నిర్వహించారు వైసీపీ ఎన్నారై నేతలు. దాదాపుగా వంద మంది వరకు పాల్గొన్న ఈ సభలో వైఎస్ చేసిన సేవలను కొనియాడుతూ ఆయనకు ఘనమైన నివాళి అర్పించారు.

లైటింగ్ ల్యాంప్ ద్వారా ఏర్పాటు చేసిన దీపాలతో వైఎస్ కు నివాళులు అర్పించిన వైసీపీ ఎన్నారై నేతలు.. ఆయన ఆత్మకు శాంతికి చేకూరాలని కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి హాజరైన పలువురు వైసీపీ నేతలు, వైఎస్ అభిమానులు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. జన హ్రుదయ నేతగా ఆయన ప్రజల మదిలో నిలిచిపోయిన తీరు గురించి పలువురు వక్తలు ఆసక్తికర ప్రసంగం చేశారు.

ysrcp

మానసికంగా, శారీరకంగా వైఎస్ చాలా ధ్రుడవంతులన్న విషయాన్ని ఈ సందర్బంగా పలువురు నేతలు గుర్తు చేశారు. తన జీవితాంతం రైతుల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, మహిళల కోసం అహర్నిశలు శ్రమించిన వ్యక్తిగా ఆయన్ను కొనియాడారు.

ఈ నేపథ్యంలోనే.. ఏపీ అధికార పార్టీ టీడీపీపై పలు విమర్శలు చేశారు వైసీపీ నేతలు. ఏపీ ప్రజలను టీడీపీ మోసం చేసిందని, ఎన్నికల్లో ఇచ్చిన సంక్షేమ పథకాల హామిని నిలబెట్టుకోలేకపోయిందని టీడీపీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేంత వరకు తామంతా పార్టీ అధినేత జగన్ కు అండగా నిలబడుతామని చెప్పారు. జగన్ అధికారంలోకి వస్తే.. గతంలో వైఎస్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నింటిని తిరిగి పునరుద్దరిస్తామని తెలియజేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+