మహిళలపై వేధింపులు: ఎన్నారై అరెస్ట్

Indian American convicted for sexually assaulting women
న్యూయార్క్: పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసులో భారతీయ అమెరికన్‌ను న్యూయార్క్ పోలీసులు అరెస్ట్ చేశారు. పది మంది మహిళలపై వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో దర్యాప్తు జరిపిన పోలీసులు, నేరం రుజువు కావడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

నిందితుడు మితేన్ పటేల్ (35)ను ఆగస్టు 2, 2012న పోలీసులు అరెస్ట్ చేశారు. ఘటనపై విచారణ జరిపిన పోలీసులు, కనీసం పదిమందిపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు తేల్చారు. అయితే నిందితుడు పటేల్ తమపై లైంగిక వేధింపులకు పాల్పడలేదని, తమకు తుపాకీ చూపించి దోపిడీకి పాల్పడ్డాడని ఇద్దరు బాధితులు పోలీసులకు తెలిపారు. 2011లోనూ నిందితుడు రెండు దోపిడీ కేసుల్లో నిందితుడని న్యాయవాది పేర్కొన్నారు.

నిందితుని చేతిలో దోపిడీకి గురైన ఇద్దరు బాధితులు ధైర్యంగా పోలీసులను ఆశ్రయించడంతో పటేల్ నేరాలు బయటికి వచ్చాయని న్యాయవాది జాన్ ఫ్లామర్ తెలిపారు. నిందితుడు మరో ఏడుగురు మహిళలను తుపాకీతో బెదిరింపులకు గురి చేసి వారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆయన తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు పటేల్‌ను అరెస్ట్ చేసి, అతనికి సంబంధించిన వ్యాన్, తుపాకీని స్వాధీనం చేసుకన్నారు.

కాగా సోమవారం జరిపిన విచారణలో పటేల్ బాధితులలో చాలా మంది వ్యభిచార వృత్తిలో ఉన్నవారేనని తేలింది. తాను బాధితులకు డబ్బులు చెల్లించే శృంగారంలో పాల్గొన్నానని నిందితుడు పటేల్ పేర్కొంటున్నాడు. తాను ఎవరితోనూ లైంగిక సంబంధం కలిగిలేనని చెప్పాడు. పటేల్ వాదనను న్యాయవాది పాక్షికంగా అంగీకరిస్తున్నారు. బాధితులు వ్యభిచారంలో కొనసాగుతున్నందుకే వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేదని న్యాయవాది ఒకరు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+