ఇండిపెండెన్స్ డే: జై భారత్, జై తెలంగాణ (పిక్చర్స్)
హైదరాబాద్: ఇండియన్ జింఖానా క్లబ్, ఇండియన్ హై కమిషన్ ఆధ్వర్యం లో లండన్‌లో 68 వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా లండన్ - భారత రాజ్యంగా కమిషనర్ జాతీయ జెండా ఎగురవేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో భారత దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల్లోని
ప్రవాస సంస్థలు తమ ప్రాముఖ్యతను వివరిస్తూ స్టాల్ లు ఏర్పాటు చేశాయి.
తెలంగాణా రాష్ట్రం తరుపున తెలంగాణా ఎన్నారై ఫోరం స్టాల్ ని పెట్టి రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ప్రాముఖ్యం గురించి హాజరైన ప్రవాస బారతీయులకి ఇతర అతిథులకి వివరించారు. అలాగే సాంప్రదాయ తెలంగాణ పిండి వంటలని వచ్చిన అతిథులకి రుచి చూపించారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నారై ఫోరం వ్యవస్థాపక సభ్యులు అనిల్ కూర్మాచలం, అద్యక్షులు సీకా
చంద్రశేకర్ గౌడ్, ఉపాధ్యక్షులు పవిత్ర రెడ్డి, అడ్వైజరీ బోర్డు సభ్యుడు ఉదయ నాగరాజు సంయుక్త కార్యదర్శి గోలి తిరుపతి, కోశాధికారి దొంతుల వెంకట్ రెడ్డి, ఈవెంట్స్ ఇంచార్జ్ నగేష్ రెడ్డి, అశోక్ కుమార్ దాసరి, రంగు వెంకట్, వాణి, గోలి సుమన్ తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ స్టాల్....
లండన్‌లో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో తెలంగాణ ఎన్నారై ఫోరం తెలంగాణ సంస్కృతిని ప్రదర్శించడానికి స్టాల్ ఏర్పాటు చేసింది.

రెపరెపలాడిన జాతీయ జెండా
లండన్‌లో జరిగిన స్వాతంత్ర్య వేడుకల్లో భారత జాతీయ పతాక రెపరెపలాడింది. లండన్‌లో భారత స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి.

స్వాతంత్ర్య వేడుకలు...
లండన్‌లో జరిగిన భారత స్వాతంత్ర్య వేడుకల్లో ఇంగ్లాండులోని భారతదేశానికి చెందిన ఎన్నారైలు పాల్గొన్నారు.

తెలంగాణ ఎన్నారైలు..
లండన్‌లో జరిగిన భారత స్వాతంత్ర్య వేడుకల్లో తెలంగాణ ఎన్నారైలు పాల్గొన్నారు. జై భారత్, జై తెలంగాణ బ్యానర్లను ప్రదర్శించారు.












Click it and Unblock the Notifications