బీమా సొమ్ము కోసం స్నేహితుడి హత్య

పోలీసుల కథనం ప్రకారం.. జగ్దేవ్ సింగ్ రాయ్ (44) తన పాఠశాల స్నేహితుడైన జస్బీర్ సింగ్ బెయిన్స్‌ను తన ఇంట్లోనే ఉంచుకున్నాడు. మద్యానికి బానిసైన బెయిన్స్‌కి నివాసం లేకపోవడం ఇందుకు కారణం. వెస్ట్ మిడ్లాండ్‌లోని అతని నివాసం సమీపంలోని పార్క్ దగ్గర బెయిన్స్ గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. ఆ తర్వాత సమీపంలోని నదిలో బెయిన్స్ మృతదేహాన్ని పడేశాడని గత ఆదివారం అక్కడి మీడియా కథనాలు వెలువరించాయి.
కాగా, 2012, నవంబర్ 28న నదిలో కొట్టుకుపోతున్న బెయిన్స్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బెయిన్స్ మృతిపై పోలీసులు విచారణ జరిపారు. వారి విచారణలో ఇన్య్సూరెన్స్ కోసమే తన స్నేహితుడైన బెయిన్స్‌ను జగ్దేవ్ హత్య చేశాడని నిర్ధారించారు. మృతునికి సంబంధించిన ఇన్య్సూరెన్స్ పాలసీ ద్వారా వచ్చిన 319,000 పౌండ్లను జగ్దేవ్ తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు.
బెయిన్స్ హత్యపై అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపిన పోలీసులు, సిసి కెమెరా ఫుటేజి, బెయిన్స్ ఫోన్ కాల్స్ జాబితాలను పరిశీలించారు. బెయిన్స్‌ను హత్య గురైన రోజున అతన్ని పార్క్ వద్దకు రావాల్సిందిగా జగ్దేవ్ కోరినట్లు ఫోన్ కాల్ డేటా ద్వారా పోలీసులకు తెలిసింది. పోలీసుల విచారణలో నిందితుడు నేరాన్ని అంగీకరించడంతో జగ్దేవ్‌కు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది కోర్టు. ఇంతకు ముందు జగ్దేవ్.. రాజు గుర్బక్ష్ సింగ్ అనే వ్యక్తి హత్య కేసులో కూడా జైలు శిక్షను అనుభవించాడు. మద్యం మత్తులో వాహనాన్ని నడుపుతూ రాజు గుర్భక్ష్ సింగ్‌ను ఢీకొట్టడంతో అతను మరణించాడు.












Click it and Unblock the Notifications