సాధారణ ఎన్నికలపై ఎన్నారైల వెబ్‌సైట్

భారతదేశంలో త్వరలో జరగనున్న సాధారణ ఎన్నిలపై తమ వెబ్‌సైట్ ద్వారా దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఈ వెబ్‌సైట్ ద్వారా విద్యార్థులు, అకాడమిక్స్, ప్రొఫెషనల్స్, బ్యూరోక్రాట్స్, జర్నలిస్టులు తమ అభిప్రాయాన్ని తెలపవచ్చని విద్యార్థులు పేర్కొన్నారు. ఎన్నికలపై వారి అభిప్రాయం, రాజకీయా పార్టీలు, నాయకులపై వారికున్న భావాలను ఈ వెబ్‌సైట్ ద్వారా వ్యక్తం పర్చవచ్చని విద్యార్తులు పేర్కొన్నారు.
వెబ్‌సైట్ రూపొందించిన వారిలో దేవ్ జ్యోత్ ఘోషల్, ఆనంద్ కటకం, ఇవా దీక్షిత్, ఇంద్రాని బసు, రిషి అయ్యంగార్, అపర్ణ అల్లూరి ఉన్నారు. భారతదేశంలో లోక్‌సభ స్థానాలు 545 ఉన్నందున తమ వెబ్‌సైట్‌ను ఆ పేరుతోనే రూపొందించినట్లు తెలిపారు. సైట్ ప్రారంభించిన 36 గంటల్లోనే సుమారు 500 మందికి పైగా ఫేస్‌బుక్ ద్వారా లైక్ చేశారని చెప్పారు. 400మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారని చెప్పారు.
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామిక దేశమైన భారతదేశంలో త్వరలో సాధారణ ఎన్నికలు జరుగుతున్న దృష్ట్యా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు, వారి అభిప్రాయాలను తెలుసుకునేందుకు తమ సైట్ తోడ్పడుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యం, భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలపై ఇప్పటికే నిర్వహించిన చర్చల్లో అనేకమంది పాల్గొని వారి అభిప్రాయాలను వెల్లడించారని విద్యార్థులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications