అంతర్జాతీయ రైల్వే భేటీ: తెలుగు ఎన్నారైకి అవార్డు

ఓమన్‌: ఓమన్‌లోని గ్రాండ్ హాయత్ మస్కట్ హోటల్‌లో అంతర్జాతీయ రైల్వే సమావేశం రెండు రోజుల పాటు జరిగింది. ఈ సమావేశంలో దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు పాల్గోన్నారు. ఈ సమావేశంలో ఓమన్ రైల్వే సిస్టమ్ గురించి చర్చించారు. ఓమన్ రైల్వే సిస్టమ్ 2200 కిమీ రైల్వే నెట్ వర్క్‌ను పూర్తి చేసుకున్న సందర్బంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు.

ఓమన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ ప్రాజెక్టు సక్సెస్ అయ్యేందుకు... దీనికి సంబంధించి ప్రాజెక్ట్ నిర్వహకుడిగా ఆంధ్రప్ర్దదేశ్‌కు చెందిన ఎమ్ఎన్ఆర్ గుప్త ప్రాజెక్టు మేనేజ్‌మెంట్ గా వ్యవహారించనున్నారు. ఎమ్ఎన్ఆర్ గుప్త ప్రాజెక్ట్ నిర్వహణ, ఇంటిగ్రేటెడ్ రవాణాకి సంబంధించిన టెక్నికల్ ప్రజెంటేషన్‌ను ప్రదర్శించారు.

ఎమ్ఎన్ఆర్ గుప్త ఇచ్చిన ప్రజెంటేషన్‌కు గాను ప్రత్యేక బహుమతిని అందుకున్నారు. ఇండియా నుండి ఈ ప్రజెంటేషన్‌‌కి వచ్చిన ఏకైక వ్యక్తి ఎమ్ఎన్ఆర్ గుప్త. ఈ ప్రతిష్టాత్మక సమావేశంలో పాల్గొనేందుకు భారతదేశం తరుపున ఇక్కడికి వచ్చారు. ఈ సమావేశంలో ఎమ్ఎన్ఆర్ గుప్త చేసిన సిఫార్సులను ప్రపంచ నిపుణులు అభినందించారు. ఈ సమావేశంలో అమెరికా, లండన్, నెదర్లాండ్స్, కోరియాకు చెందిన పలువురు ప్రతినిధులు పాల్గోన్నారు.

 International railway conference held at Oman
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+