వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లండన్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన

By Pratap
|
Google Oneindia TeluguNews

లండన్: తెలంగాణ జెఎసి ఈ నెల 29 వ తేదిన తలపెట్టిన "సకల జన భేరి" విజయవంతం చేయాలనీ తెలంగాణా వాదులకు పిలుపునిస్తూ, ఎన్నారై టి.ఆర్.యస్ సెల్, తెలంగాణ ఎన్నారై ఫోరం సంయుక్తంగా సెంట్రల్ లండన్ లోని నెహ్రు విగ్రహం వద్ద "కొవ్వత్తుల ప్రదర్శన" నిర్వహించారు. ముందుగా తెలంగాణా రాష్ట్ర సాధనలో అమరులైన బిడ్డలకు నివలర్పించి, తరువాత "జై తెలంగాణ" నినాదాలు చేశారు.

తెలంగాణ బిడ్డ ప్రపంచ లో ఎకడున్నా కేవలం హైదరాబాద్ రాజధానిగా 10 జిల్లాల తెలంగాణ మాత్రమే కోరుకుంటున్నారని, వెంటనే తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశ పెట్టి నాలుగున్న కోట్ల ప్రజల దశాబ్దాల కల నెరవేర్చాలని అన్నారు. అలాగే తెలంగాణ ప్రజలను కించపరిచే విదంగా ఎ.పి.ఎన్.జి.వో నాయకుడు అశోక్ బాబు చేస్తున్న వాఖ్యాలను తీవ్రంగా ఖండించారు. దమ్ముంటే అవే వాఖ్యలు మల్లి హైదరాబాద్ లో సభ పెట్టి చెప్పాలని సవాల్ చేసారు.

NRI s support Telangana skala jana bheri

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి ఇక అధికారం లో కొనసాగే నైతిక హక్కు లేదని, నిన్నటి మీడియా సమావేశం తో పక్క తెలంగాణా ద్రోహి అని తేలిపోయిందని విమర్శించారు. తెలంగాణ జెఎసి తలపెట్టిన "సకల జన భేరి" కి ఇంటికోక్కరు చొప్పున వెళ్లి విజయవంతం చేయాలనీ, తెలంగాణ సత్తా ఇటు తెలంగాణ ద్రోహులకి, అటు డిల్లి పెద్దలకు చూపెట్టాలని విజ్ఞప్తి చేసారు. కెసిఆర్, కోదండరామ్ నాయకత్వాల్లో ఎటువంటి పోరటాలకైన యావత్ తెలంగాణ ఎన్నారై బిడ్డలు సిద్దంగా ఉన్నారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టి.ఆర్.యస్ అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, టిఇ.ఎన్.ఎఫ్ కోఆర్డినేటర్ నవీన్ రెడ్డి, జువ్వాడి వేణుగోపాల్ రావు, శుశుమ్న రెడ్డి ఎన్నారై టి.ఆర్.యస్ సెల్ సంయుక్త కార్యదర్శులు సిక్క చందూ గౌడ్, అశోక్ దూసరి, లండన్ ఇంచార్జ్ శ్రీకాంత్ పెద్దిరాజు, అడ్వైసరీ బోర్డ్ సబ్యులు వేనుముద్దల విష్ణువర్ధన్ రెడ్డి, ఐటి సెక్రటరీ శ్రవణ్ రెడ్డి, చిత్తరంజన్ రెడ్డి, రంగు వెంకట్, ప్రసాద్ తోట, ప్రశాంత్ రెడ్డి, సంతోష్, రోహిత్, రవి ల తో పాటు హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ ప్రతినిథులు మల్లా రెడ్డి, మల్లేష్ యాదవ్, జితేందర్ బీరం, చోటు శ్రీచక్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

English summary
Telangana NRIs in London organised candle lights programme in london supporting Telangana sakala jana Bheri to be held by Telangana JAC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X