ముక్కోటి వృక్షార్చన: సిటీలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ నేతలు బిజీ
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ బర్త్ డే సందర్బంగా ఎన్నారై తెరాస వ్యవస్థాపక అధ్యక్షులు అనిల్ కూర్మాచలం విషెస్ తెలియజేశారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపుమేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా ముక్కోటి వృక్షార్చనలో పాల్గొన్నారు. దూలపల్లిలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజుతో కలిసి మొక్కలు నాటారు.

కేటీఆర్ పిలుపుమేరకు సంబరాలకు దూరంగా ఉంటూ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా పలువురికి ఆర్ధిక సహాయం చేశారు. లండన్ లో ఉన్న కార్యవర్గ సభ్యులు కేటీఆర్ గారి పుట్టినరోజు కానుకగా మొక్కలను నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. కేటీఆర్ చేస్తున్న సేవాకార్యక్రమాలను , అభివృద్ధి పనులను గుర్తుకుచేసుకున్నారు.

కేటీఆర్ మరెన్నో ఉన్నత పదవులను అధిష్టించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ యూకే అధ్యక్షులు అశోక్ గౌడ్ దూసరి, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ లండన్ కార్యవర్గ సభ్యులు, ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ నేతలు సతీష్ రెడ్డి గొట్టెముక్కుల, మల్లేష్ పప్పుల, ప్రవీణ్ పంతులు, సుభాష్, సికింద్రాబాద్ నేత నరేష్ తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications