విశాఖ పునర్నిర్మాణానికి ఎన్నారై నిధులు(పిక్చర్స్)
డల్లాస్: హుధుద్ తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విశాఖనగరాన్ని పునర్నిర్మించేందుకు అమెరికాలో ఉంటున్న విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు. ఇందుకోసం సేకరించిన 55,000 డాలర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు తెలిపారు.
ఆదివారం డల్లాస్‌లో సిద్ధార్థ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల ప్రతినిధులు డాక్టర్ సతీష్ కుమార్ పొట్లూరి, డా. అరుణ్ మిత్ర కంద్రా, డా. హిమ మిక్కిలినేని, డా. వంశీ కొర్రపాటి, డా. సుమన్ రావూరి, డా. వినయ వెన్నం, డా. సుధామయి మొలకలపల్లి సేకరించిన మొత్తాన్ని తానా సౌత్వెస్ట్ ప్రతినిధి డా. రాజేష్ అడుసుమిల్లికి అందజేశారు.
అమెరికాలోని సిద్దార్థ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులందరూ కలిసి ఈ మొత్తాన్ని సేకరించడం అభినందనీయమని డా. రాజేష్ అడుసుమిల్లి అన్నారు. తానా కూడా ఈ కార్యక్రమానికి మద్దతుగా నిలుస్తోందని చెప్పారు. ఈ మొత్తాన్ని ముఖ్యమంత్రి తుఫాను సహాయనిధికి అందజేస్తామని ఆయన తెలిపారు. కళాశాల పూర్వ విద్యార్థుల ప్రతినిధి డా. సతీష్ పొట్లూరి తానా అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.
తానాపై ఉంచిన నమ్మకానికి సిద్దార్థ మెడికల్ పూర్వ విద్యార్థుల ప్రతినిధులను తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని కృతజ్ఞతలు తెలిపారు. తానాతో పూర్వ విద్యార్థుల అనుబంధం సుదీర్ఘమైనదని చెప్పారు. తానా మాజీ అధ్యక్షులు డా. నవనీథకృష్ణ గొర్రెపాటి, డా. ప్రసాద్ తోటకూర, తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ రామ్ యలమంచిలి, తానా కమిటీ చైర్స్ మురళీ వెన్నం, చాల కొండ్రకుంట, శ్రీకాంత్ పొలవరపు.. సిద్దార్థ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థులను అభినందించారు.
తానా ఫౌండేషన్ ట్రెజరర్ మంజులత కన్నెగంటి, తానా కమిటీ చైర్స్ ఉమా యలమంచి, సాంబ దొడ్డా, వినోద్ ఉప్పు, శివ వంకాయలపాటి, సాయి లింగ, అనిల్ ఆరేపల్లి, పరమేష్ దేవినేని, లక్ష్మీకాంత్ గొర్రెపాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

నిధుల సేకరణ
హుధుద్ తుఫాను కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న విశాఖనగరాన్ని పునర్నిర్మించేందుకు అమెరికాలో ఉంటున్న విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి చెందిన పూర్వ విద్యార్థులు ముందుకు వచ్చారు.

నిధుల సేకరణ
ఇందుకోసం సేకరించిన 55,000 డాలర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అందజేయనున్నట్లు వారు తెలిపారు.

నిధుల సేకరణ
ఆదివారం డల్లాస్‌లో సిద్ధార్థ మెడికల్ కళాశాల పూర్వ విద్యార్థుల ప్రతినిధులు డాక్టర్ సతీష్ కుమార్ పొట్లూరి, డా. అరుణ్ మిత్ర కంద్రా, డా. హిమ మిక్కిలినేని, డా. వంశీ కొర్రపాటి, డా. సుమన్ రావూరి, డా. వినయ వెన్నం, డా. సుధామయి మొలకలపల్లి సేకరించిన మొత్తాన్ని తానా సౌత్వెస్ట్ ప్రతినిధి డా. రాజేష్ అడుసుమిల్లికి అందజేశారు.

నిధుల సేకరణ
తానాపై ఉంచిన నమ్మకానికి సిద్దార్థ మెడికల్ పూర్వ విద్యార్థుల ప్రతినిధులను తానా అధ్యక్షుడు మోహన్ నన్నపనేని కృతజ్ఞతలు తెలిపారు. తానాతో పూర్వ విద్యార్థుల అనుబంధం సుదీర్ఘమైనదని చెప్పారు.












Click it and Unblock the Notifications