అమెరికాలో ఎన్నారైల టిటి పోటీలు: విజేతలు(పిక్చర్స్)
న్యూయార్క్: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(టాంటెక్స్) జాతీయ తెలుగు సంస్థ ‘నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్' (నాటా)తో కలిసి డల్లాస్ ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్‌లోని కారల్టన్ నగరములోగల డల్లాస్ టేబుల్ టెన్నిస్ క్రీడా సముదాయంలో టేబుల్ టెన్నిస్ ఆటల పోటీలను నిర్వహించింది. ఈ పోటీలలో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీలు తెలుగు వారి స్నేహానికి, సుహృద్భావానికి, ఐకమత్యానికి ప్రతీక అని అన్నారు. పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, సంస్థ కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావడము గొప్ప విషయమని, మన తెలుగు వారిని ఇంకా ఎంతో ప్రోత్సహించాలని కోరారు. నాటా ప్రాంతీయ ఉపాధ్యక్షులు జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలు, యువత ఎక్కువ మంది పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇలాంటి ఆటలకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలూ అందిస్తూ మన తెలుగు వారి అభ్యున్నతికి నాటా సంస్థ కృషి చేస్తుందన్నారు.
మహేష్ ఆదిభట్ల, మనోహర్ నిమ్మగడ్డ ప్రథమ స్థానంలో మరియు రెజిష్, కృష్ణ దాస్యం ద్వితీయ స్థానంలో నిలిచారు. పిల్లల విభాగములో అనికా రెడ్డి, రియా రెడ్డి, సాకెత్ ఉప్పెర్ల గెలిచారు. టాంటెక్స్, నాటా కార్యవర్గ సభ్యులు వెంకట్ దండ, మహేష్ ఆదిభట్ల, రామకృష్ణారెడ్డి రొడ్డ, జయచంద్రా రెడ్డి, రాజ్ తొడిగల, రాజ్ గొంది, రామసూర్యా రెడ్డి, రమణ పుట్లూరు నిర్దిష్టమైన ప్రణాళికతో టేబుల్ టెన్నిస్ ఆటల పోటీలు సక్రమంగా జరగడానికి, క్రీడాకారులకు ఆతిధ్యము ఇవ్వడానికి ఎంతో కృషి చేశారు.
విజయ్ మోహన్ కాకర్ల, సుబ్రమణ్యం జొన్నలగడ్డ, సత్యం వీర్నపు, రావు కల్వల, శ్రీనివాసరెడ్డి గుర్రం, శ్రీధర్ కొర్సపాటి, రమణ కురుసపాటి, మహేందర్ కామిరెడ్డి సహాయ సహకారాలు అందించారు. టాంటెక్స్ క్రీడల ప్రతినిధి వెంకట్ దండ, నాటా క్రీడల ప్రతినిధి రాజేంద్ర తొడిగల న్యాయనిర్ణేతలకు, స్వచ్చందకార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.

టిటి పోటీలు
తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ టెక్సాస్(టాంటెక్స్) జాతీయ తెలుగు సంస్థ ‘నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్' (నాటా)తో కలిసి డల్లాస్ ఫోర్ట్ వర్త్ మెట్రోప్లెక్స్‌లోని కారల్టన్ నగరములోగల డల్లాస్ టేబుల్ టెన్నిస్ క్రీడా సముదాయంలో టేబుల్ టెన్నిస్ ఆటల పోటీలను నిర్వహించింది.

టిటి పోటీలు
ఈ పోటీలలో పిల్లలు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా టాంటెక్స్ ఉత్తరాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహా రెడ్డి మాట్లాడుతూ.. ఈ పోటీలు తెలుగు వారి స్నేహానికి, సుహృద్భావానికి, ఐకమత్యానికి ప్రతీక అని అన్నారు.

టిటి పోటీలు
నాటా ప్రాంతీయ ఉపాధ్యక్షులు జయచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. పిల్లలు, యువత ఎక్కువ మంది పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.

టిటి పోటీలు
మహేష్ ఆదిభట్ల, మనోహర్ నిమ్మగడ్డ ప్రథమ స్థానంలో మరియు రెజిష్, కృష్ణ దాస్యం ద్వితీయ స్థానంలో నిలిచారు. పిల్లల విభాగములో అనికా రెడ్డి, రియా రెడ్డి, సాకెత్ ఉప్పెర్ల గెలిచారు.
-
నయనతార బ్రేకప్ వెనుక అసలు రహస్యం.. ప్రభుదేవా ఆ ఒక్క కండీషన్ వల్లే? -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
ఇకపై 4 గంటలేక ఆఫీసులు క్లోజ్.. షాప్స్, మాల్స్ కూడా ?? -
బంగారం ధరలకు గత వైభవం -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
ఈ కొమ్మల మధ్య ఉన్న పచ్చని పామును చూశారా ? -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్న్యూస్ -
ఇండియాలో ఫస్ట్ టైమ్ సెల్ఫ్ క్లీనింగ్ ఏసీ.. 10 సెకన్లలోనే కూలింగ్ !! -
విశాఖ రైల్వే జోన్ పరిధిలో కీలక మార్పులు, ప్రధాన మార్గం విలీనం..!!












Click it and Unblock the Notifications